‘నేను విశాఖలోనే ఉంటాను. నేను ఈసారి విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తాను. విశాఖకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నాను. ఈ నగరాన్ని ఒక గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతాను..’అని చెప్పడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చేశారు. రానున్న ఎన్నికల్లో గెలుపు విషయంలో తనకు ఎలాంటి శషభిషలు లేవని.. గెలిచి తీరుతున్నాం అని చెప్పారు. అంతేకాదు మళ్ళీ ఇక్కడే నేను ప్రమాణస్వీకారం చేస్తాను అని కూడా తేల్చి పారేసారు.
ఇక ఇటు శత్రుకూటమి అయిన టీడీపీ జనసేన ఇంకా పొత్తులతో పోట్లాడుకుంటున్నాయి. ఎవరికీ ఎక్కడ.. ఏయే సీట్లు.. పోటీ చేసేది ఎవరు.. పోటు పొడిచేది ఎవరు.. ఓట్లు వచ్చేది ఎవరికీ అనేది తేల్చుకోలేక సతమతమవుతున్నాయి. మరోవైపు చంద్రబాబు.. పవన్ ఇద్దరూ ఢిల్లీ పెద్దలవైపు చూస్తూ పొత్తులకు పాకులాడుతున్నాయి. వారు ఇలా దారీతెన్నూ లేకుండా కళ్ళకు గంతలు కట్టుకుని చీకట్లో దొంగాట ఆడుతుండగా ఇటు జగన్ మాత్రం ఎన్నికల మాటను వదిలేసి ప్రమాణస్వీకారం గురించి మాట్లాడడం ద్వారా తన కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేశారు.
ఇది వినడానికి సాధారణంగానే ఉండొచ్చు కానీ.. గుండెలోతుల్లో ఎంత దమ్ము.. గెలుపు మీద మనసులో ఎంత నమ్మకం విశ్వాసం లేకపోతే అలా చెప్పగలరు ? అటు ఇంకా మ్యాచ్ కోసం ప్యాడ్స్, హెల్మెట్స్ కట్టుకుని ఆటగాళ్లు క్రీజ్‌లోకి రాకముందే ఇటు వైపున్న జట్టు గెలుపును ఖరారు చేసినట్లుగా జగన్ చేసిన ప్రసంగం క్యాడర్‌లో గొప్ప ఊపు తెచ్చాయి. ఎస్.. ఈసారి మళ్ళీ గెలుస్తున్నాం.. మనమే గెలుస్తున్నాం.. ఎందుకు గెలవం..? మనమేం తక్కువ చేశాం.. రాష్ట్రంలోని ఏ వర్గాన్ని వదలకుండా సంక్షేమం ఇచ్చాము. ఏ ప్రాంతాన్నీ మర్చిపోకుండా అభివృద్ధిని పరిచయం చేశాం.
చదవండి: హైదరాబాద్ కంటే మిన్నగా వైజాగ్‌లో అభివృద్ధి: సీఎం జగన్
గత డెబ్భైయేళ్లలో ఎన్నడూ చట్ట సభల ముఖం చూడని కొన్ని అణగారిన వర్గాలవారికి పదవులిచ్చి పథకాలిచ్చి చేయిపట్టుకుని చట్టసభలకు తీసుకొచ్చి కూర్చొబెట్టాం. పేదవాడి కంచంలో అన్నం ముద్దయ్యాం.. చదువుకునే పిల్లాడి చేతిలో పలకమయ్యాం.. పేదింటి ఆడబిడ్డకు తోడయ్యాం.. పండుటాకుల చేతిలో ఊతకర్రమయ్యాం.. మరి మనకన్నా తోపులేవరు.. మనకన్నా గొప్పపాలకులెవరు.. ఎస్.. అందుకే మళ్ళీ మనమే వస్తున్నాం. అనే కాన్ఫిడెన్స్ క్యాడర్లో నింపిన జగన్ స్పీచ్ అందర్నీ ఆకట్టుకుంది.
నా ప్రమాణ స్వీకారం విశాఖలోనే అంటూ వేదికను సైతం ప్రకటించడం ద్వారా యుద్ధం ముగిసింది. ఇక మీరు ఇళ్లకు వెళ్లొచ్చు అనే సంకేతం ప్రతిపక్షాలకు జగన్ ఇచ్చారు. ఇక ఇటు మాత్రం ఇంకా వాళ్ళు సీట్లకోసం... స్థానాలకు లక్కీ డ్రా వేసుకుంటూనే ఉన్నారు.
///సిమ్మాదిరప్పన్న ///
చదవండి: Vision Visakha: ప్రతీ జిల్లాలో ఓ స్కిల్ కాలేజ్: సీఎం జగన్
Comments
Please login to add a commentAdd a comment