సాక్షి, కర్నూలు: పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా ప్రారంభించారు. అనంతరం సంకల్‌భాగ్ ఘాట్‌లో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు. కాగా.. కోవిడ్ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నా, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆర్భాటాలు లేకుండా సంప్రదాయరీతిలో, శాస్త్రోక్తంగా నిర్వహించి పుష్కరాలను విజయవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేసింది.
జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాల్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి డిసెంబర్ 1వరకు.. 12 రోజులపాటు తుంగభద్ర పుష్కరాలను నిర్వహించనున్నారు. ఐదువేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఘాట్ల వద్ద ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. కార్యక్రమంలో సీఎం జగన్ వెంట మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, గుమ్మనూరు జయరాం, కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, కంగాటి శ్రీదేవి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సుధాకర్, తొగురు ఆర్థర్ ఉన్నారు.
తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్
Published Fri, Nov 20 2020 1:39 PM | Last Updated on Fri, Nov 20 2020 4:39 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment