Tungabhadra Pushkaralu 2020
-
‘పవన్ కల్యాణ్ షోలు చేయటానికే ఉన్నారు’
సాక్షి, అమరావతి : పవిత్ర తుంగభద్ర పుష్కరాలు విజయవంతంగా ముగిశాయని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, సెంట్రల్ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు వెల్లంపల్లి, జయరాం, స్థానిక ప్రజా ప్రతినిధులకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. కరోనా సమయంలో సైతం కేంద్రం సూచించిన విధంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పుష్కరాలు నిర్వహించారని అన్నారు. తుంగభద్ర పుష్కరాలలో 3 లక్షల 90 వేల మంది భక్తులు పాల్గొని జల్లు స్నానాలు ఆచరించారని తెలిపారు. భక్తులకు ఏటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సమర్ధవంతంగా పుష్కరాలను నిర్వహించిందని అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఛాతుర్ మాస దీక్ష అని హైదరాబాద్‌లో కూర్చున్న పవన్ కల్యాణ్‌కు పుష్కరాలలో పాల్గొనే తీరిక లేదు. కేవలం సినిమాలో మాదిరిగా షో చేసేందుకే పవన్ ఉన్నారు. ( బాబూ వంద కోట్ల ఫైన్ అప్పుడే మర్చిపోయారా..?) అధికారంలో ఉంటే ప్రజలను చంపటానికేనా పుష్కరాలు?.. చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో హిందూ ధర్మం నాలుగు పాదాల మీద ఉండేలా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారు. పుష్కరాలను పరిగణలోకి తీసుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌ల తీరును ప్రజలు గమనించాలి. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో.. ముఖ్యమంత్రి సూచనలతో విజయవంతంగా పుష్కరాలు ముగిశాయి. పుష్కరాలను పొలిటికల్‌గా వాడుకున్న వ్యక్తి చంద్రబాబు. పుష్కరాలలో పాల్గొనని చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌ల నైజాన్ని ప్రజలు గమనించాల’’ని అన్నారు. -
చివరి రోజు తుంగభద్ర పుష్కరాలు
-
పదకొండో రోజు : తుంగభద్ర పుష్కరాలు ఫోటోలు
-
పదవరోజు : తుంగభద్ర పుష్కరాలు ఫోటోలు
-
పవిత్ర గంగే.. పావన తుంగే
కర్నూలు (సెంట్రల్): వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తుంగభద్ర పుష్కరాలకు భక్తులు తరలివచ్చారు. ‘పవిత్ర గంగే.. పావన తుంగే నమోస్తుతే’ అంటూ నదీమ తల్లికి వాయనాలు సమర్పించారు. 8వ రోజైన శుక్రవారం కూడా కర్నూలు జిల్లాలోని 23 ఘాట్లలో భక్తులు పుష్కర పూజలు నిర్వహించారు. కర్నూలు సంకల్‌భాగ్ ఘాట్‌లో ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప ఆధ్వర్యంలో అమ్మ, అక్షిత భవన్ పాఠశాలలు, నేషనల్ బ్లైండ్ ఫెడరేషన్‌కు చెందిన అంధులకు పుష్కర స్నానం ఆచరించే అవకాశం కల్పించారు. కోవిడ్ ప్రొటోకాల్‌ను పాటిస్తూ అంధ విద్యార్థులు పూజలు నిర్వహించారు. అనంతరం నీటిని తలపై సంప్రోక్షణ చేసుకున్నారు. యాగశాలలో నిర్వహిస్తున్న హోమంలో పాల్గొని వేద పండితుల ఆశీర్వచనాలు పొందారు. అనంతరం వారికి బెడ్షీట్లు, స్వీట్ ప్యాకెట్లను ఎస్పీ ఫక్కీరప్ప, డీఎస్పీ కేవీ మహేష్ అందజేశారు. సకల సంపదలు, సౌభాగ్యాల కోసం హోమం సంకల్‌భాగ్ పుష్కర ఘాట్‌లో ఏర్పాటు చేసిన యాగశాలలో మహాలక్ష్మి మూలతంతు హోమాన్ని వేద పండితులు నిర్వహించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సాగిన హోమాన్ని పుష్కర స్నానాల కోసం వచ్చిన మహిళలు కనులారా వీక్షించి అమ్మవారి దీవెనలు అందుకున్నారు. ఈ హోమం వల్ల మహిళలకు సకల సంపదలు, సౌభాగ్యాలు కలుగుతాయని, రాష్ట్రంలోని మహిళలంతా సుఖ, శాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ మహాలక్ష్మి మూలతంతు హోమాన్ని నిర్వహించినట్టు వేద పండితుడు చెండూరి రవిశంకర్ అవధాని తెలిపారు. -
ఎనిమిదవ రోజు : తుంగభద్ర పుష్కరాలు ఫోటోలు
-
ఏడో రోజు : తుంగభద్ర పుష్కరాలు ఫోటోలు
-
లోక పావని.. పుష్కర వాహిని
కర్నూలు (సెంట్రల్): లోక పావని.. పుష్కర వాహిని తుంగభద్రమ్మను భక్తి శ్రద్ధలతో అర్చించారు. దోషాలను కడిగేసే నదీమ తల్లికి పాలు, పన్నీరు.. పసుపు, కుంకాలు.. శ్రీగంధపు ధారలు.. పంచామృతాలను అర్పించి అభ్యంగన స్నానాలు ఆచరించారు. కర్నూలు జిల్లాలో ఈ నెల 20న ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు బుధవారం ఆరో రోజుకు చేరుకున్నాయి. వేకువజామునుంచే భారీగా తరలివచ్చిన భక్తులు పుష్కర స్నానాలు ఆచరించి నదీమ తల్లికి వాయనాలు సమర్పించి దీవెనలు అందుకున్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 23 ఘాట్లలో భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. తుపాను హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా తరలివచ్చిన యాత్రికులు మంత్రాలయం, సంగమేశ్వరం, గురజాల, కర్నూలులోని సంకల్‌భాగ్ ఘాట్లలో పుష్కర పూజలు నిర్వహించారు. పెద్దల అనుగ్రహం కోసం పిండ ప్రదానాలు చేశారు. ఐశ్యర్యాలు సిద్ధించాలని హోమం కార్తీక శుద్ధ ఏకాదశి విశిష్టమైన రోజు కావడంతో.. శ్రీ మహావిష్ణువుకు వేద సూక్తములతో నారాయణ క్రతువు నిర్వహించారు. ఈ హోమం వల్ల రాష్ట్ర ప్రజలకు ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని, కల్యాణ యోగం కలుగుతుందని రవిశంకర్ అవధాని తెలిపారు. హోమంలో పెద్దఎత్తున భక్తులు పాల్గొని స్వామి వారి అనుగ్రహం పొందారు. నివర్ తుపాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతి పుష్కర ఘాట్ వద్ద ఒక్కో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచింది. వీరితోపాటు పోలీసులు, ఆగ్నిమాపక, డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది, బోట్లు, రక్షణ కవచాలను అందుబాటులో ఉంచింది. ఈ ప్రత్యేక బృందాలు ఈ నెల 28 వరకు ఘాట్లలోనే ఉంటాయి. మరోవైపు పుష్కరాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా నిర్విరామంగా కొనసాగేందుకు కలెక్టర్ జి.వీరపాండియన్ నేతృత్వంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. -
ఆరవ రోజు తుంగభద్ర పుష్కరాలు
-
తల్లీ.. ప్రణమిల్లి!
కర్నూలు (అర్బన్): తుంగభద్ర నదీ తీరానికి భక్తజనం వెల్లువెత్తింది. నదీమ తల్లికి ప్రణమిల్లి.. పుష్కర స్నానాలు ఆచరించారు. పసుపు, కుంకుమలతో గంగమ్మను అర్చించి వాయనాలు సమర్పించారు. కర్ణాటక సరిహద్దులోని మేలిగనూరు మొదలుకొని సంగమేశ్వరం వరకు గల ఘాట్లలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు సూర్యోదయం నుంచే భక్తులు పోటెత్తారు. సమీపంలోని ఆలయాల్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మరికొందరు పితృ దేవతలకు పిండ ప్రదానాలను జరుపుకున్నారు. పుష్కరాలకు ఐదో రోజైన మంగళవారం వీఐపీల తాకిడి తగ్గగా.. 50 వేల మందికి పైగా సామాన్య భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. అన్ని ఘాట్లలో జల్లు స్నానాలు (షవర్లు) ఏర్పాటు చేయడంతో ప్రశాంతమైన వాతావరణంలో స్నానాలు చేస్తున్నామనే సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మంత్రాలయం, సంగమేశ్వరం ఘాట్లకు యాత్రికులు భారీగా తరలివచ్చారు. కార్తీకమాసం పరమ శివునికి ప్రీతిపాత్రం కావడం వల్ల సంగమేశ్వరం ఘాట్‌లో స్నానం చేసి సంగమేశ్వరునికి అభిషేకాలు, ఇతర పూజలు నిర్వహించుకున్నారు. లక్షణాలు ఉన్నవారికి కోవిడ్ పరీక్షలు ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని పుష్కర ఘాట్లలో కోవిడ్ నిబంధనలను పక్కాగా అమలు చేస్తున్నారు. భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్య సిబ్బంది థర్మల్ స్క్రీనింగ్‌తో పాటు జ్వరం, దగ్గు వంటి లక్షణాలున్న వారికి కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. అన్నిచోట్లా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం అడుగడుగునా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. -
అయిదవ రోజు తుంగభద్ర పుష్కరాలు
-
తుంగభద్ర తీరం.. ఆధ్యాత్మిక తరంగం
కర్నూలు (అగ్రికల్చర్): ఒకపక్క కార్తీక సోమవారం.. మరోపక్క పుష్కర సమయం.. ఈ పవిత్రమైన రోజున తెలతెలవారుతూనే తుంగభద్ర తీరం ఆధ్యాత్మిక తరంగమైంది. కార్తీక దీపాలు, పుణ్యకార్యక్రమాలతో పుష్కర ఘాట్లలో సందడి నెలకొంది. పుష్కరాలకు నాలుగో రోజున తెలుగు రాష్ట్రాల నుంచే గాక వివిధ రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులతో కర్నూలు జిల్లాలోని పుష్కర ఘాట్లు నిండిపోయాయి. 23 పుష్కరఘాట్లకు ఉదయం 5 గంటల నుంచే భక్తుల తాకిడి మొదలైంది. 75 వేల మందికిపైగా భక్తులు.. పవిత్ర జలాలను తలపై చల్లుకోవడం, జల్లు స్నానాలాచరించడం ద్వారా పులకించిపోయారు. నదిలో నీటి ప్రవాహం కొంతమేర పెరగడంతో జిల్లా యంత్రాంగం పుట్టిలను, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచింది. సిబ్బందిని అప్రమత్తం చేసింది. ముఖ్యంగా కర్నూలులోని సంకల్‌భాగ్, పంప్‌హౌస్, కర్నూలు మండలం సుంకేసుల ఘాట్లతో పాటు మంత్రాలయం, సంగమేశ్వరం ఘాట్లు భక్తులతో కిక్కిరిశాయి. కర్నూలులోని సంకల్‌భాగ్ పుష్కరఘాట్‌లో తుంగభద్ర నదీమతల్లికి విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి: కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప సుంకేసుల పుష్కరఘాట్‌ను సందర్శించారు. పంచలింగాల పుష్కరఘాట్‌ను ప్రభుత్వ విప్ కె.శ్రీనివాసులు సందర్శించారు. ఆయన వెంట కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ ఉన్నారు. సుంకేసుల ఘాట్‌ను పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి దంపతులు సందర్శించారు. పుష్కరాల కోసం కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలి వచ్చారు. పుష్కర స్నానం తర్వాత రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నారు. సంకల్‌భాగ్ ఘాట్‌లో తుంగభద్ర నదికి సాయంత్రం 6 గంటలకు వేదపండితులు పంచహారతులు ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో 3 పుష్కరాలు రావడం గొప్ప విశేషం శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో తుంగభద్ర, కృష్ణా, గోదావరి నదుల పుష్కరాలు రావడం గొప్ప విశేషమని విశాఖ శారద పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి అన్నారు. సోమవారం ఆయన కర్నూలులోని సంకల్‌భాగ్ పుష్కర ఘాట్‌లో తుంగభద్రమ్మకు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు, దండ తర్పణ చేశారు. శారద పీఠం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి.. పవిత్ర పుష్కర జలాలతో సంప్రోక్షణ చేసుకున్నారు. విశ్వశాంతి యాగంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీమన్నారాయణుని అవతారమైన వరాహమూర్తి ఇరు దంతాల నుంచి తుంగ, భద్ర నదులు ఉద్భవించాయని, అలాంటి నదికి పుష్కరాలు రావడం గొప్ప విశేషమన్నారు. పుష్కరాల సమయంలో 12 రోజుల పాటు నదిలో ముక్కోటి దేవతలు నిక్షిప్తమై ఉంటారని, స్నానమాచరించినా, సంప్రోక్షణ చేసుకున్నా వారి ఆశీస్సులు లభిస్తాయన్నారు. -
నాలుగో రోజు తుంగభద్ర పుష్కర స్నానాలు.. ఫోటోలు
-
తుంగభద్ర నదిలో దీపాలతో భక్తుల సందడి
-
తుంగభద్ర పుష్కరాలు : సంకల్‌భాగ్ పుష్కరఘాట్‌లో భక్తుల సందడి
-
పుష్కరుడికి స్వాగతం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కోవిడ్ నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య భక్తుల మనోభావాలకు అనుగుణంగా తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది భక్తి శ్రద్ధలతో పుణ్య స్నానమాచరించే ఈ పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటాలు లేకుండా, శాస్త్రోక్తంగా ప్రారంభించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం మధ్యాహ్నం కర్నూలు నగరంలోని సంకల్‌భాగ్ ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్కరాలను ప్రారంభించారు. వేదమంత్రోచ్ఛారణతో పుష్కర ఘాట్‌లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తుంగభద్ర పుష్కరాల్లో పాల్గొనేందుకు విజయవాడ నుంచి విమానంలో ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో కర్నూలులోని ఏపీఎస్పీ బెటాలియన్‌కు వచ్చారు. పట్టుపంచె, తెల్లచొక్కా ధరించి సంప్రదాయ వస్త్రధారణలో సంకల్‌భాగ్ పుష్కరఘాట్‌కు చేరుకున్నారు. ప్రభుత్వం తరఫున తుంగభద్రమ్మకు సమర్పించేందుకు పట్టు వస్త్రాలను చేతుల్లో పెట్టుకుని ముందుకు కదలగా, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి.. మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణ మధ్య ముఖ్యమంత్రిని నది వరకు తీసుకొచ్చారు. నది ఒడ్డున ఉన్న తుంగభద్రమ్మ విగ్రహానికి ఆయన పూలమాల వేశారు. దేవగురువు బృహస్పతి మకరరాశిలోకి ప్రవేశించగానే సరిగ్గా మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరుడు తుంగభద్రలోకి ప్రవేశించాడు. పుష్కరుడిని నదిలోకి ఆహ్వానిస్తూ పండితుల వేదమంత్రోచ్ఛారణ మధ్య ముఖ్యమంత్రి ‘స్వాగత పూజ’ చేశారు. పుష్కరుడి ప్రవేశానంతరం నదీ జలాలకు పండితులు విశేషమైన ఉపచార పూజలు చేశారు. అనంతరం సీఎం పట్టువస్త్రాలను సమర్పించారు. వేద పండితులు పంచహారతులిచ్చారు. ముఖ్యమంత్రి కూడా తుంగభద్రమ్మకు హారతినిచ్చి పూజలు చేశారు. పుష్కరుడి రాక తర్వాత అపూర్వ, విశేషమైన శక్తిని సంతరించుకున్న పుష్కర జలాన్ని సీఎం వైఎస్ జగన్ శిరస్సుపై ప్రోక్షించుకున్నారు. పుష్కరాల ప్రారంభం సందర్భంగా నదికి హారతి ఇస్తున్న సీఎం వైఎస్ జగన్ యాగశాలకు పూర్ణాహుతి – ముఖ్యమంత్రి నది నుంచి నేరుగా యాగశాలకు చేరుకున్నారు. యాగశాలలో నాలుగు మూలల్లో ఉన్న వాస్తుమండపం, సర్వతోభద్ర మండపం, యోగిని మండపం, నవగ్రహ మండపం వద్ద అప్పటికే వేదపండితులు పూజలు చేసి, ఆవాహన చేసిన యాగశాలకు ముఖ్యమంత్రి పుష్పాలు సమర్పించారు. – పండితుల ఆధ్వర్యంలో అక్కడ జరుగుతున్న ఆయుష్షు హోమంలో పాల్గొని, పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా పండితులు ముఖ్యమంత్రికి తిలకం దిద్ది వేదాశీర్వచనం చేశారు. – సంప్రదాయ వస్త్రాలతో, పాదరక్షలు లేకుండా పుష్కర పూజల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి.. పుష్కరుడికి పూజలు చేసి హారతి సమర్పించారు. సుగంధ ద్రవ్యాలను సమర్పించారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని, రాష్ట్రం, ప్రజలు సిరిసంపదలతో విరాజిల్లాలని ప్రార్థించారు. యాగశాలలో హోమం అనంతరం పూర్ణాహుతి సమర్పిస్తున్న సీఎం కోవిడ్ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు – 12 ఏళ్లకోసారి అంగరంగ వైభవంగా జరిగే తుంగభద్ర పుష్కరాలు ఈ ఏడాది ప్రత్యేక పరిస్థితుల్లో ప్రారంభమయ్యాయి. కోవిడ్ నేపథ్యంలో ప్రభుత్వం పుష్కర స్నానాలకు అనుమతి నిరాకరించింది. తలపై నీళ్లు చల్లుకుని, సంప్రదాయ పద్ధతిలో పుష్కర పూజలు చేసుకోవాలని భక్తులకు సూచించింది. – దీంతో మొదటిరోజు ఘాట్ల వద్ద రద్దీ కన్పించలేదు. ఎక్కువగా ప్రభుత్వ అధికారులు, వీఐపీలు మాత్రమే ఘాట్లకు చేరుకున్నారు. భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్‌లు ధరించి పుష్కర పూజల్లో పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది భక్తుల శరీర ఉష్ణోగ్రతను పరిశీలించి, శానిటైజ్ చేశాకే ఘాట్లలోకి అనుమతిస్తున్నారు. – ముఖ్యమంత్రి ఉన్న సమయంలో సంకల్‌భాగ్ పుష్కరఘాట్‌లోకి పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రజాప్రతినిధులు, వీఐపీలకు అనుమతి ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, శంకర్‌నారాయణ, గుమ్మనూరు జయరాం, కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా పుష్కరాలు ప్రారంభం – కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది వెంబడి 23 పుష్కరఘాట్లు ఏర్పాటు చేశారు. అన్ని ఘాట్లలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు ప్రత్యేక పూజలు చేసి పుష్కరాలను ప్రారంభించారు. – మంత్రాలయంలో మఠాధిపతి శ్రీ సుబుదేంద్రతీర్థులు నదిలోకి వెళ్లి పుష్కరస్నానం ఆచరించారు. పుష్కరాల కోసం సప్తనదులైన గంగ, యమున, సరస్వతి, కావేరి, నర్మద, సింధూ, గోదావరి నుంచి తీసుకొచ్చిన జలాలను తుంగభద్రలో కలిపారు. తుంగభద్రమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించి పూజలు చేశారు. -
ఘనంగా తుంగభద్ర పుష్కరాలు
-
తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్
-
తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, కర్నూలు: పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలను శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా ప్రారంభించారు. అనంతరం సంకల్‌భాగ్ ఘాట్‌లో సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించి, హోమంలో పాల్గొన్నారు. కాగా.. కోవిడ్ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నా, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆర్భాటాలు లేకుండా సంప్రదాయరీతిలో, శాస్త్రోక్తంగా నిర్వహించి పుష్కరాలను విజయవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని మంత్రాలయం, ఎమ్మిగనూరు, నందికొట్కూరు, కోడుమూరు, కర్నూలు నియోజకవర్గాల్లో పుష్కరాలకు ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి డిసెంబర్ 1వరకు.. 12 రోజులపాటు తుంగభద్ర పుష్కరాలను నిర్వహించనున్నారు. ఐదువేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఘాట్ల వద్ద ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. కార్యక్రమంలో సీఎం జగన్ వెంట మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, గుమ్మనూరు జయరాం, కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, కంగాటి శ్రీదేవి, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సుధాకర్, తొగురు ఆర్థర్ ఉన్నారు. -
నేడు కర్నూలుకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, కర్నూలు: తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కర్నూలు రానున్నారు. సంకల్‌భాగ్ ఘాట్‌లో పుష్కర పూజలు నిర్వహించనున్నారు. నేపథ్యంలో సంకల్‌భాగ్ ఘాట్‌లో ఏర్పాట్లను గురువారం మధ్యాహ్నం మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, గుమ్మనూరు జయరాం, కలెక్టర్ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సుధాకర్, తొగురు ఆర్థర్ పరిశీలించారు. ఈ ఘాట్‌లోకి జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులను తప్ప, ఇతరులెవరినీ అనుమతించకూడదని నిర్ణయించారు. సీఎం వెళ్లిన తరువాతే ఇతరులను ఘాట్‌లోకి అనుమతిస్తారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు, ఏపీఎస్పీ బెటాలియన్‌లో ముఖ్యమంత్రిని కలిసేందుకు కొద్దిమందికి అవకాశం కల్పించనున్నారు. (నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు) సీఎం పర్యటన కొనసాగుతుందిలా.. శుక్రవారం ఉదయం 11 గంటలు: తాడేపల్లిలోని ఇంటి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలు దేరుతారు 11.20: గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకుంటారు 11.30: గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఓర్వకల్లుకు విమానంలో బయలు దేరుతారు 12.30: ఓర్వకల్లు ఎయిర్ పోర్టు చేరుకుంటారు 12.40: ఓర్వకల్లు ఎయిర్ పోర్టు నుంచి హెలికాప్టర్లో కర్నూలులోని ఏపీఎస్పీ బెటాలియన్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు బయలు దేరుతారు 12.55: ఏపీఎస్పీ బెటాలియన్ చేరుకుంటారు 1 గంట: ఎస్పీఎస్పీ బెటాలియన్ నుంచి రోడ్డు మార్గన సంకల్‌భాగ్ పుష్కర్ ఘాట్‌కు బయలు దేరుతారు 1.10: సంకల్‌భాగ్ పుష్కర ఘాట్ చేరుకుంటారు 01.10 నుంచి 01.50 గంటలు: పుష్కర ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు 01.50: సంకల్‌భాగ్ నుంచి ఏపీఎస్పీ బెటాలియన్‌కు బయలు దేరుతారు 2 గంటలు: ఏపీఎస్పీ బెటాలియన్ చేరుకుంటారు 02.05: బెటాలియన్ నుంచి హెలికాప్టర్లో ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు బయలు దేరుతారు 2.20: ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు చేరుకుంటారు 2.30: ఓర్వకల్లు నుంచి విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలుదేరి వెళ్తారు -
పుష్కరతుంగ... భద్రగంగ
జలాన్ని దేవతా రూపంలో తల్లిగా భావించి పూజించడం హిందువుల సంప్రదాయం. నదీస్నానాలు, కోనేటి స్నానాలు, మంగళ స్నానాలు, సముద్ర స్నానాలు... అలాగే తీర్థ యాత్రలు, పుణ్య క్షేత్రాలు దర్శనం... సమస్తం నీటితో ముడిపడి వున్నాయి. నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్య ప్రదమని హిందువుల విశ్వాసం. సకల జీవరాశులకు ప్రధానమైన జలస్నానం ప్రాముఖ్యతను గుర్తుచేసేవే పుష్కరాలు. ‘తుంగే పానీ.. గంగే స్నానే’ అన్నది ఆర్యోక్తి. గంగానదిలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తుంగభద్ర జలాలు తాగితే అంతే పుణ్యం వస్తుందని దీనికి అర్థం! అసలు తుంగభద్ర నది ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం... హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టి సముద్రంలో వేయగా శ్రీ మహావిష్ణువు వరాహావతారమెత్తి తన కోరలతో భూమిని సాగరం నుండి పైకెత్తి సర్వజీవులనూ రక్షించాడు. తుంగ (ఎత్తు) నుండి రావడం వల్ల తుంగానదిగానూ, హిరణ్యాక్షుని సంహరించే సమయంలో వరాహరూపుడైన విష్ణువు కుడి కోర నుండి కారిన లాలాజలం భద్రానదిగానూ ఉద్భవించాయి. పుష్కరాలు జరిగే 12 నదులలో తుంగభద్ర ఒకటి. రాష్ట్రంలో చివరి తుంగభద్ర పుష్కరాలు 2008 లో జరిగాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి తుంగభద్ర పుష్కరాలు ఇవే. నవగ్రహాల్లో ఒకటైన గురు గ్రహం సంవత్సరానికి ఒకసారి చొప్పున 12 రాశుల్లో పరిభ్రమిస్తుంటుంది. బృహస్పతి మకరరాశిలో ప్రవేశించే సమయంలో తుంగభద్ర నదికి పుష్కరాలు నిర్వహిస్తారు. ఈ పుష్కరాలు జరిగే 12 రోజుల్లో ముక్కోటి దేవతలు ఆ నదిలో కొలువై ఉంటారని, ఈ సమయంలో ఆ నదిలో స్నానమాచరించిన వారి పాపాలు తొలిగి.. పుణ్యం సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రముఖ దేవాలయాలను తాకుతూ వెళుతున్న తుంగభద్ర.. కర్ణాటక: శృంగేరి (చిక్మగుళూరు), పంపావతి దేవాలయం(కంప్లి), హరిహరేశ్వర దేవాలయం(హంపి). ఆంధ్రప్రదేశ్: రాఘవేంద్రస్వామి ఆలయం, (మంత్రాలయం), శివరామాలయం (గుండ్రేవుల). తెలంగాణ: సంతాన వేణుగోపాలస్వామి ఆలయం (వేణిసోంపురం), వైకుంఠ నారాయణ స్వామి ఆలయం (రాజోళి), సూర్యనారాయణ స్వామి ఆలయం (పుల్లూరు), జోగుళాంబ, బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు (అలంపూర్), సంగమేశ్వరాలయం. తుంగ, భద్ర నదులు కలసి కర్ణాటక రాష్ట్రంలోని పశ్చిమ కనుమల నుంచి ప్రవహిస్తాయి. ఈ రెండు నదులు కలిసి తుంగభద్ర నదిగా మారి.. కర్ణాటకలో కృష్ణా పరివాహక ప్రాంతం మీదుగా ప్రవహిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కౌతాళం మండలం మేళగనూరు వద్ద ప్రవేశిస్తుంది. తెలంగాణలో జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కుట్కనూరు వద్ద తుంగభద్ర రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. అనంతరం పులికల్, రాజోళి, పుల్లూరు మీదుగా సాగుతూ నదీతీరంలో కొలువైన దేవతల పాదాలను అభిషేకిస్తూ.. సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో కలుస్తుంది. తుంగభద్ర నది రాష్ట్రంలో ప్రవేశించిన తర్వాత సుమారు 90 కిలోమీటర్ల మేర ప్రవహించి సంగమేశ్వరం వద్ద కృష్ణానదిలో సంగమం అవుతున్నది. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురువడంతో తుంగభద్ర నది జలకళను సంతరించుకుంది. పుష్కరాల సందర్భంగా పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు మొత్తం 443 మంది పురోహితులను ఎంపిక చేసి, వారికి గుర్తింపు కార్డులను అందజేసింది. పిండ ప్రదానం తదితర కార్యక్రమాలకు రేట్లను ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ నిర్ధారించి, ఆ వివరాలను వీటి కోసం కేటాయించిన షెడ్ల వద్ద ప్రదర్శించనుంది. పుష్కర ఘాట్లకు సమీపంలోని ఆలయాల్లో దర్శనాలకు ఇబ్బంది లేకుండా అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన దాదాపు 300 మందికి పైగా దేవదాయ శాఖ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. కాగా నేటి మధ్యాహ్నం కర్నూలు జిల్లాలోని సంకల్బాగ్ పుష్కర ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహనరెడ్డి పాల్గొంటారు. – ఇన్పుట్స్: అంబటి తిరుమలేష్ సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజమ్ -
నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు
సాక్షి, కర్నూలు : పవిత్రమైన తుంగభద్ర పుష్కరాలు నేడు (శుక్రవారం) ఘనంగా ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరుడు నదిలో ప్రవేశిస్తాడని, అప్పటి నుంచి పుణ్యఘడియలు ప్రారంభమవుతాయని పండితులు తెలిపారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలులోని సంకల్‌భాగ్ ఘాట్‌లో ప్రత్యేక పూజలతో పుష్కరాలను ప్రారంభించనున్నారు. కోవిడ్ నేపథ్యంలో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఉన్నా, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఆర్భాటాలు లేకుండా సంప్రదాయరీతిలో, శాస్త్రోక్తంగా నిర్వహించి పుష్కరాలను విజయవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12 ఏళ్లకోసారి వచ్చే పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక జాగ్రత్తలతో అన్ని ఏర్పాట్లు చేసింది. ఐదు వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఘాట్ల వద్ద ప్రత్యేకంగా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. కర్నూలు జిల్లాలో 23 ఘాట్లు.. తుంగభద్ర నది ఆంధ్రప్రదేశ్‌లో కర్నూలు జిల్లాలో మాత్రమే ప్రవహిస్తుంది. కర్ణాటకలో ప్రవహించిన అనంతరం మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం మేళిగనూరు(నదిచాగి) వద్ద ఆంధ్రలో ప్రవేశిస్తుంది. 156 కిలోమీటర్ల మేర మంత్రాలయం, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, నందికొట్కూరు నియోజకవర్గాలలో ప్రవహించాక కొత్తపల్లి మండలం సంగమేశ్వరం వద్ద కృష్ణా నదిలో కలుస్తుంది. నది పరివాహక ప్రాంతంలో 23 పుష్కర ఘాట్లను ప్రభుత్వం నిర్మించింది. ఘాట్లలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పించింది. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పుష్కరాలకు అనుమతి ఇచ్చింది. కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పుష్కరఘాట్ల వరకూ 43 బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేసింది. ఘాట్ల వద్ద తాత్కాలిక బస్షెల్టర్లను ఏర్పాటు చేశారు. తుంగభద్ర నదిలో ప్రస్తుతం 5 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. పుష్కరాల సమయంలో నీటి సమస్య లేకుండా చూసేందుకు అదనంగా రోజుకు 3 వేల క్యూసెక్కుల చొప్పున తుంగభద్ర డ్యాం నుంచి నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంది. స్నానాలకు అనుమతి లేదు.. కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉండటం, రెండో దశ మొదలవ్వడం, నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. భక్తులు నదిలో పుష్కరస్నానాలు ఆచరించేందుకు అనుమతి నిరాకరించింది. అయితే పిండప్రదానాలకు అవకాశం కల్పించింది. ఈ–టికెట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న వారికి అనుమతి ఇచ్చింది. ఈ–టికెట్ వెబ్సైట్ (https://tungabhadrapushkaralu 2020.ap.gov.in)ను మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుమ్మనూరు జయరాం, జిల్లా కలెక్టర్ వీరపాండియన్, ఎమ్మెల్యేలు గురువారం కర్నూలు జిల్లా కలెక్టరేట్లో ప్రారంభించారు. వెబ్సైట్ ద్వారా భక్తులు తమకు నచ్చిన పుష్కర ఘాట్లలో స్లాట్ బుక్ చేసుకోవచ్చు. సంప్రదాయ పూజలకు, పిండప్రదానాలకు 23 ఘాట్లలో 350 మంది పురోహితులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఒక్కో పురోహితుడు రోజుకు 16 స్లాట్ల చొప్పున (ఒక్కో స్లాట్‌లో ఇద్దరు) పూజలు చేస్తారు. ఈ టికెట్ బుక్ చేసుకోకుండా నేరుగా వస్తే పిండప్రదానాలకు అనుమతి ఉండదు. కృష్ణా, గోదావరి పుష్కరాల్లో నిర్వహించినట్లుగా ఇప్పుడు కూడా పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు అన్ని ఘాట్లలో గంగాహారతి ఇవ్వనున్నారు. కాగా, సీఎం పర్యటన సందర్భంగా సంకల్‌భాగ్ వీఐపీ పుష్కర ఘాట్‌లో ఏర్పాట్లను మంత్రులు బుగ్గన, జయరాం, ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, సుధాకర్, తొగురు ఆర్థర్ పరిశీలించారు. నాడు తండ్రి.. నేడు కుమారుడు.. గత తుంగభద్ర పుష్కరాలు 2008 డిసెంబర్ 10న ప్రారంభమయ్యాయి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి డిసెంబర్ 11న కర్నూలు నగరంలోని సంకల్‌భాగ్ ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి, నదికి హారతి ఇచ్చారు. ప్రస్తుతం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సంకల్‌భాగ్ ఘాట్‌లోనే పుష్కరాలు ప్రారంభించనున్నారు. తండ్రి, తనయులు ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో వరుస పుష్కరాలు రావడం అరుదైన ఘట్టంగా భక్తులు భావిస్తున్నారు. పుష్కరాలను విజయవంతం చేయాలి: వీరపాండియన్, కలెక్టర్, కర్నూలు కోవిడ్ నేపథ్యంలో కఠిన పరిస్థితుల్లో పుష్కరాలు నిర్వహిస్తున్నాం. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అత్యంత భక్తిభావంతో నిర్వహిస్తాం. ఈ–టికెట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకున్న వారు పిండప్రదానాలు చేసుకోవచ్చు. పుష్కరాల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ప్రత్యేక పరిస్థితుల్లో జరిగే ఈ చారిత్రక ఘట్టాన్ని విజయవంతం చేసేందుకు భక్తులు సహకరించాలి. కేంద్ర నిబంధనలతో నియంత్రణ చర్యలు: మంత్రి వెలంపల్లి కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి రావడం వల్లే తుంగభద్ర పుష్కరాల్లో కొన్ని నియంత్రణ చర్యలు చేపడుతున్నామని, భక్తులు సహకరించాలని దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కోరారు. భక్తులకు ఉచితంగా అందజేసే ఈ–టికెట్ విధానంలో భక్తులు ఏ సమయంలో ఏ ఘాట్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి అనే వివరాలు ఉంటాయన్నారు. గత ప్రభుత్వ హాయాంలో గోదావరి, కృష్ణా పుష్కరాలకు రూ. వేల కోట్లు ఖర్చు చేసి అవినీతికి పాల్పడితే, తమ ప్రభుత్వం అవసరమైన మేరకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పూర్తిగా పొదుపుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఈ పుష్కరాల్లో భక్తుల పుణ్య స్నానాలకు అనుమతి తెలపలేదని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో పేదలకు డిసెంబర్ 25వ తేదీన ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తుంటే.. ఆరోజు క్రిస్మస్ అంటూ కొందరు విమర్శలు చేయడం సరికాదని, ఆరోజు ముక్కోటి ఏకాదశి పండుగ కూడా అనే విషయం విమర్శ చేసే వారికి తెలియకపోవచ్చని ఎద్దేవా చేశారు. -
నది స్నానాలకు అనుమతి లేదు: వెల్లంపల్లి
సాక్షి, కర్నూలు : తుంగభద్ర పుష్కరాలు రేపటి(నవంబర్ 20) నుంచి ప్రారంభం అవుతున్నాయని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. డిసెంబర్ 1 వరకు ఈ పుష్కరాలు కొనసాగుతాయన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుష్కరాలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు మాత్రమే ఘాట్‌లోకి భక్తులను అనుమతిస్తామని చెప్పారు. తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం కర్నూలుకు రానున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం స్నానాలను నిషేదించిట్లు మంత్రి వివరించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ నది స్నానాలకు అనుమతి లేదని మంత్రి గుర్తు చేశారు. పుష్కరాలను కూడా విపక్షాలు రాజకీయ కోణంలో చూస్తున్నాయని విమర్శించారు. పుష్కరాల పేరుతో చంద్రబాబు నాయుడు వందల కోట్ల రూపాయలను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. -
తుంగభద్ర పుష్కరాలకు సీఎం వైఎస్ జగన్
సాక్షి, కర్నూలు(సెంట్రల్): తుంగభద్ర పుష్కరాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన పర్యటన ఖరారైంది. ఈ నెల 20న కర్నూలులోని సంకల్‌భాగ్ పుష్కర ఘాట్‌ను సందర్శిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పర్యటన సాగేలా చర్యలు తీసుకుంటున్నారు. సీఎం సందర్శించే సంకల్‌భాగ్ (వీఐపీ) పుష్కర ఘాట్‌లోకి ఆయన పర్యటన సమయంలో జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులను తప్పా ఇతరులెవరినీ అనుమతించకూడదని నిర్ణయించారు. సీఎం తిరిగి వెళ్లిన తరువాతే ఇతరులను ఘాట్‌లోకి అనుమతిస్తారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు, ఏపీఎస్పీ బెటాలియన్‌లో ముఖ్యమంత్రిని కలిసేందుకు కొద్దిమందికి అవకాశం కల్పించనున్నారు. సమన్వయంతో పని చేయండి సీఎం వైఎస్ జగన్ పర్యటన విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. మంగళవారం ఆయన సునయన ఆడిటోరియంలో ఎస్పీ డాక్టర్ కె.ఫక్కీరప్ప, జేసీలు ఎస్.రామసుందర్‌రెడ్డి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్‌తో కలిసి తుంగభద్ర పుష్కరాలపై సమీక్షించారు. పుష్కరాలకు సీఎం వస్తున్నందున ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు. పెండింగ్ పనులన్నీ బుధవారం సాయంత్రంలోపు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో డీఆర్వో బి.పుల్లయ్య, కేఎంసీ కమిషనర్ డీకే బాలాజీ, సబ్ కలెక్టర్ కల్పనా కుమారి పాల్గొన్నారు. ఏర్పాట్ల పరిశీలన సీఎం పర్యటన ఏర్పాట్లలో భాగంగా మంగళవారం సాయంత్రం కలెక్టర్ వీరపాండియన్, జాయింట్ కలెక్టర్ రామసుందర్ రెడ్డి, నగరపాలక కమిషనర్ డీకే బాలాజీతో కలిసి నగరంలోని ఏపీఎస్పీ బెటాలియన్‌లో హెలిప్యాడ్, సంకల్‌భాగ్ ఘాట్‌ను పరిశీలించారు. అలాగే బెటాలియన్ నుంచి కొత్తబస్టాండ్, బంగారు పేట, ఎస్టీబీసీ కళాశాల, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, నరసింగరావు పేట మీదుగా సంకల్‌భాగ్‌లోని పుష్కరఘాట్ వరకు సీఎం వెళ్లే దారిని చూశారు. సంకల్‌భాగ్ పుష్కర ఘాట్‌లో ముఖ్యమంత్రి చేయనున్న పూజలకు సంబంధించిన ఏర్పాట్లు చూడాలని నగరపాలక కమిషనర్‌ను ఆదేశించారు. పర్యటన సాగేదిలా.. ఉదయం 11 గంటలు : తాడేపల్లిలోని ఇంటి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు బయలు దేరుతారు. 11.20 : గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 11.30 : గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో ఓర్వకల్లుకు బయలుదేరుతారు. 12.30 : ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 12.40 –12.55 : ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి కర్నూలు ఏపీఎస్పీ బెటాలియన్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంట : ఏపీఎస్పీ బెటాలియన్ నుంచి రోడ్డుమార్గాన సంకల్‌భాగ్ పుష్కర ఘాట్‌కు బయలు దేరుతారు. 1.10 : సంకల్‌భాగ్‌కు చేరుకుంటారు 1.10 – 1.50 : పుష్కర ఘాట్‌లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 1.50– 2.00 : సంకల్‌భాగ్ నుంచి బయలుదేరి బెటాలియన్‌కు చేరుకుంటారు. 2.05– 2.20 : బెటాలియన్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 2.30 : ఓర్వకల్లు నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరి వెళతారు. -
20న తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం
సాక్షి, అమరావతి: తుంగభద్ర పుష్కర ప్రారంభ ముహూర్తం ఖరారైంది. 20వ తేదీ మధ్యాహ్నం 1.21 గంటలకు పుష్కరాల ప్రారంభ ముహుర్తంగా దేవదాయ శాఖ నిర్ణయించింది. దేవదాయ శాఖ అర్చక ట్రైనింగ్ అకాడమీ ఆధ్వర్యంలో ఇటీవల విశాఖపట్నంలో దైవజ్ఞ సమ్మేళనంలో పంచాంగకర్తలు నిర్ధారించిన ఈ ముహూర్త వివరాలను అధికారిక అనుమతి కోసం దేవదాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ 1వ తేదీ మధ్య 12 రోజుల పాటు పుష్కరాలు కొనసాగుతాయి. గతంలో 2008లో తుంగభద్ర పుష్కరాలు జరిగాయి. 23 పుష్కర ఘాట్లు సిద్ధం ► తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు జిల్లాలో 23 పుష్కర ఘాట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు దేవదాయ శాఖ అధికారులు వెల్లడించారు. కోవిడ్–19 నేపథ్యంలో కేంద్రప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వైద్య, ఆరోగ్య శాఖ ఈసారి నదీ స్నానాలకు బదులుగా భక్తులు జల్లు సాన్నాలు చేయాలని సూచించింది. ఆ మేరకు ఘాట్ల వద్ద అధికార యంత్రాంగం స్ప్రింకర్లను ఏర్పాటు చేస్తోంది. ► పుష్కరాల సందర్భంగా పితృ దేవతలకు పిండ ప్రదానం చేసేందుకు మొత్తం 443 మంది పురోహితులను ఎంపిక చేసి, వారికి గుర్తింపు కార్డులను అందజేసింది. ► పిండ ప్రదానం, తదితర కార్యక్రమాలకు రేట్లను దేవదాయ శాఖ నిర్ధారించి, ఆ వివరాలను వీటి కోసం కేటాయించిన షెడ్ల వద్ద ప్రదర్శించనుంది. ► పుష్కర ఘాట్లకు సమీపంలోని ఆలయాల్లో దర్శనాలకు ఇబ్బంది లేకుండా అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన దాదాపు 300 మందికి పైగా దేవదాయ శాఖ సిబ్బందిని ప్రత్యేకంగా విధుల్లో నియమించారు. దేవదాయ శాఖ కార్యక్రమాలపై ప్రత్యేక కమిషనర్ అర్జునరావు ఆయా జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పలు సూచనలు చేశారు. 20న పుష్కరాల్లో పాల్గొననున్న సీఎం జగన్ తుంగభద్ర పుష్కరాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి డిసెంబర్ ఒకటవ తేదీ వరకు తుంగభద్ర పుష్కరాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 20వ తేదీన కర్నూలు జిల్లాలోని సంకల్బాగ్ పుష్కర ఘాట్ వద్ద శాస్త్రోక్తంగా జరిగే కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి జగన్ పాల్గొంటారు. ఈ మేరకు సీఎం పర్యటన వివరాలను ముఖ్యమంత్రి అదనపు పీఎస్ కె.నాగేశ్వరరెడ్డి ప్రభుత్వ అధికారులకు సర్క్యులేట్ చేశారు.