
సాక్షి, తాడేపల్లి: గ్రామ,వార్డు సచివాలయాల్లో డిజిటల్ పేమెంట్స్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ), కెనరా బ్యాంక్‌ల సహకారంతో సచివాలయాల్లో యూపీఐ చెల్లింపుల సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాల్లో డిజిటల్ లావాదేవీలు ప్రారంభం అయ్యాయి. గ్రామ వార్డు, సచివాలయాల్లో ప్రస్తుతం 543 రకాల సేవలను ప్రభుత్వం అందజేస్తున్న విషయం తెలిసిందే. వినియోగదారులు ఇక నుంచి ఈ సేవలను అవసరమైతే డిజిటల్ పేమెంట్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. (విద్యార్థులకు మంచి జరగాలి: సీఎం జగన్)
సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ ‘‘ప్రతి గడపకు ప్రభుత్వ సేవలను అందించాలన్నదే లక్ష్యం. దీని కోసం గ్రామ, వార్డు సచివాలయాలను తీసుకు వచ్చాం. వీటిలో 545 కిపైగా సేవలందిస్తున్నాం. దీంతో పాటు ప్రతి యాభై కుటుంబాలకు ఒక వాలంటీర్‌ను పెట్టాం. ఈ యాభై కుటుంబాల బాధ్యతను వాలంటీర్ తీసుకుంటారు. ప్రతి 2 వేల జనాభాకు గ్రామ, వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు మరో అడుగు ముందుకేశాం. డిజిటల్ పేమెంట్ వ్యవస్థను తీసుకువచ్చామని’ తెలిపారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంకును సీఎం వైఎస్ జగన్ అభినందించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్‌జైన్ హజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కెనరా బ్యాంక్ ఎండీ, సీఈఓ ఎల్.వి.ప్రభాకర్, ఎన్‌పీసీఐ ఎండీ, సీఈఓ దిలిప్ అస్బే పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment