
న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం(శుక్రవారం) అమిత్ షాతో సీఎం జగన్ భేటీ అయ్యారు. అమిత్ షాతో జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.
అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. పార్లమెంటులోని ప్రధాన మంత్రి కార్యాలయంలో సమావేశమైన సీఎం.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించారు. ఈ మేరకు సీఎం విజ్ఞాపన పత్రం అందించారు.
ఇక్కడ చదవండి: ప్రధాని మోదీ వద్ద సీఎం జగన్ ప్రస్తావించిన అంశాలు ఇవే..
Comments
Please login to add a commentAdd a comment