
సాక్షి, అమరావతి: అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్ హాజరయ్యారు. ‘తెలుగుజాతి ఆత్మ గౌరవ ప్రతీక అమరజీవి పొట్టి శ్రీరాములు గారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషి చేసి, ఆంధ్ర రాష్ట్ర అవతరణకు బాటలు వేసిన ఆ మహనీయుని జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను’ అని సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
చదవండి: తెలుగు ప్రజల ధిక్కార స్వప్నం అమరజీవి