CM YS Jagan Review On Revenue Earning Departments - Sakshi
Sakshi News home page

CM Jagan: అప్రమత్తంగా ఉండాలి.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

Published Mon, Nov 14 2022 2:27 PM | Last Updated on Mon, Nov 14 2022 6:06 PM

CM YS Jagan Review On Revenue Earning Departments - Sakshi

సాక్షి, అమరావతి: ఆదాయార్జన శాఖలపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. విద్యుత్, అటవీ పర్యావరణ, భూగర్భ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

పన్ను చెల్లింపుదారులకు అధికారులు మరింత అవగాహన కల్పించాలని, చెల్లింపుల ప్రక్రియను మరింత సౌలభ్యంగా చేయాలని సీఎం సూచించారు. అక్రమాలకు పాల్పడుతున్న ఏజెన్సీల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ట్రేడ్‌ అడ్వైజరీ కమిటీ సమావేశాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు.

‘‘నియంత్రణ చర్యల వల్ల మద్యం వినియోగం గణనీయంగా తగ్గింది. రేట్లు పెంచడం వల్ల కూడా మద్యం వినియోగం తగ్గింది. అక్రమ మద్యం తయారీపై ఎస్‌ఈబీ(స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) ప్రత్యేక దృష్టి సారించాలి’’ అని సీఎం అన్నారు.

రిజిస్ట్రేషన్‌ శాఖపైనా సీఎం సమీక్ష
శాశ్వత భూహక్కు, భూ సర్వే కార్యక్రమం చేపడుతున్న గ్రామాల్లో.. వార్డుల్లో...సబ్‌ రిజిస్ట్రార్‌ భవనం, సేవలు వంటి వాటిపై అవగాహన కలిగించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి ఈ దిశగా ఓరియెంటేషన్‌ అందించాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో..  ఏఏ రకాల డాక్యుమెంట్లును రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చన్న విషయాలపై ప్రజలకూ అర్ధమయ్యేలా వివరించాలని సీఎం సూచించారు. సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాను అప్‌గ్రేడ్‌ చేయాలని సీఎం ఆదేశించారు.

మైనింగ్‌ శాఖపై సమీక్ష
నాన్‌ ఆపరేషనల్‌ మైన్స్‌పై మరింత దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. నిరుపయోగంగా ఉన్న మైనింగ్‌ ఏరియాలో కార్యకలాపాలు మొదలయ్యేలా చూడాలని సీఎం జగన్ అన్నారు.
చదవండి: లోకేష్‌ వ్యవసాయం గురించి మాట్లాడటం మన కర్మ: మంత్రి కాకాణి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement