
సాక్షి, అమరావతి: సోమవారం ఉదయం 12.30 గంటలకు వైఎస్సార్‌సీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో సీఎం తాడేపల్లిలోని తన నివాసం నుంచి ఢిల్లీలోని పార్టీ ఎంపీలతో పలు అంశాలపై మాట్లాడతారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై రాజ్యసభ, లోక్‌సభల్లో వ్యవహరించాల్సిన తీరుపై ఎంపీలకు దిశానిర్దేశం చేస్తారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రానికి ఆర్థిక సాయం, పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర సమస్యలు, ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి, జీఎస్‌టీ బకాయిల చెల్లింపు ప్రస్తావన, పోలవరం నిధుల సాధన, తదితర అంశాలపై అనుసరించాల్సిన వ్యూహం గురించి ప్రధానంగా ఎంపీలతో చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment