ముగిసిన సీఎం జగన్‌ విశాఖ, అనకాపల్లి పర్యటన | CM YS Jagan Visakhapatnam Tour Updates | Sakshi
Sakshi News home page

ముగిసిన సీఎం జగన్‌ విశాఖ, అనకాపల్లి పర్యటన

Published Mon, Oct 16 2023 10:05 AM | Last Updated on Mon, Oct 16 2023 9:32 PM

CM YS Jagan Visakhapatnam Tour Updates - Sakshi

Updates

విశాఖ, అనకాపల్లిలో అధికారిక కార్యక్రమాలు ముగించుకుని తాడేపల్లి చేరుకున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

03:36PM, అక్టోబర్‌ 16, 2023
►అధికారిక కార్యక్రమాలు ముగియడంతో.. అచ్యుతాపురం నుంచి వైజాగ్ ఎయిర్ పోర్ట్‌కి బయలుదేరిన ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి

02:39PM, అక్టోబర్‌ 16, 2023
►అచ్యుతాపురంలో లారస్ యూనిట్ 2 ను ప్రారంభించిన సీఎం జగన్
►460 కోట్లతో ప్రారంభించిన యూనిట్ 2 ద్వారా 1200 మందికి ఉద్యోగాలు
►లారస్ కు సంబంధించిన మరో రెండు కొత్త యూనిట్లకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
►850 కోట్లతో కొత్తగా నిర్మించే రెండు యూనిట్లు ద్వారా మరో 800 మందికి ఉద్యోగాలు.

02:26PM, అక్టోబర్‌ 16, 2023
►అచ్యుతాపురం చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్

1:15PM, అక్టోబర్‌ 16, 2023
►పరవాడ సెజ్‌లో ఫార్మా యూనిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

12:30PM, అక్టోబర్‌ 16, 2023
►బీచ్‌ క్లీనింగ్‌ సమకూర్చిన యంత్రాలు ప్రారంభం

12:03PM, అక్టోబర్‌ 16, 2023
ఇన్ఫోసిస్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ స్పీచ్‌
►హైదరాబాద్‌, బెంగళూరు మాదిరిగా విశాఖ ఐటీ హబ్‌గా మారబోతోంది
►రాష్ట్రంలోనే విశాఖ అతిపెద్ద నగరం
► ఇప్పటికే విశాఖ ఎడ్యుకేషన్‌ హబ్‌గా తయారైంది
►ప్రతీ ఏడాది 15వేల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు
►విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రఖ్యాత సంస్థలు ముందుకొస్తున్నాయి
►ఏపీలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తాం
►ఒక్క ఫోన్‌ కాల్‌తో ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కంపెనీలకు కల్పిస్తా
►వైజాగ్‌లో విస్తారమైన అవకాశాలు
►త్వరలోనే నేను విశాఖకు షిప్ట్‌ అవుతున్నాను:

11:20AM, అక్టోబర్‌ 16, 2023
►విశాఖలో అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపనలు
►ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌
►కాసేపట్లో రెండు ఫార్మా యూనిట్లకు శంకుస్థాపన 
►ప్రత్యక్షంగా 4160 మందికి ఉద్యోగావకాశాలు

10:55AM, అక్టోబర్‌ 16, 2023
►విశాఖ చేరుకున్న సీఎం జగన్‌
►విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకున్న సీఎం జగన్‌
►ఎయిర్‌పోర్ట్‌లో సీఎం జగన్‌కు సాదర స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, అనకాపల్లి ఎంపీ సత్యవతి, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ,, విశాఖ ఎంపీ సత్యనారాయణ, పలువురు వైఎస్సార్‌సీపీ నేతలు
►విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి హెలికాప్టర్‌లో మధురవాడ బయల్దేరిన సీఎం జగన్‌

9:58AM, అక్టోబర్‌ 16, 2023
►విశాఖకు బయల్దేరిన సీఎం జగన్‌

► విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో మరో రూ.1,624 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి రానున్నాయి. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల పర్యటనలో భాగంగా పలు ఐటీ, ఫార్మా కంపెనీల ప్రారంభోత్సవాలు, భూమిపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 

►ఉదయం 10.20 గంటలకు సీఎం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10.40 గంటలకు మధురవాడ ఐటీ హిల్స్‌ నెం.3 వద్దకు వస్తారు. 
►అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఐటీ హిల్‌ నెం.2కు చేరుకొని ఇన్ఫోసిస్‌ కార్యకలాపాల్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం ఇన్ఫోసిస్‌, వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి కాసేపు సంభాషించనున్నారు.

►అనంతరం 11.55 గంటలకు బయలుదేరి హెలిప్యాడ్‌ వద్దకు చేరుకొని అక్కడ జీవీఎంసీ ఆధ్వర్యంలో బీచ్‌ క్లీనింగ్‌ మిషన్‌ ప్రారంభిస్తారు. 
►అక్కడ నుంచి హెలికాప్టర్‌లో 12.15 గంటలకు పరవాడ చేరుకొని ఫార్మా సిటీలో గల యుజియా స్టెర్లీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ప్రారంభిస్తారు.
►అనంతరం అచ్యుతాపురం సెజ్‌లో హెలిప్యాడ్‌ వద్దకు చేరుకొని.. అక్కడ మధ్యాహ్నం 1.30 నుంచి 1.45 వరకు ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు.

►అక్కడి నుంచి లారెస్‌ ల్యాబ్‌కు చేరుకొని యూనిట్‌–2ను ప్రారంభిస్తారు. పరిశ్రమను సందర్శించి, కంపెనీ సీఈఓ, డైరెక్టర్లు, ఉద్యోగులతో ఇంటరాక్ట్‌ అవుతారు.

►అక్కడ నుంచి హెలికాప్టర్‌లో 3.10 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు వస్తారు. అక్కడ నుంచి 3.20 గంటలకు తిరుగు పయనమవుతారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement