
పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీసులకు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న డీజీపీ
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ అందించే కార్యక్రమం మొదలైంది. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. పోలీసులకు వ్యాక్సిన్ వేసిన వైద్య ఆరోగ్య సిబ్బందితో పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అన్ని పోలీస్ యూనిట్లకు చెందిన పోలీస్ అధికారులతో డీజీపీ సవాంగ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పోలీస్ సిబ్బందికి వ్యాక్సిన్ వేయించే కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లాల్లో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పోలీసులకు వ్యాక్సినేషన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. పల్లె పోరు ప్రక్రియ పూర్తి కావడంతో ఇప్పుడు పోలీసులకు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment