సాక్షి, విజయవాడ: ప్రైవేట్ వైద్యులు ఆన్‌లైన్ కన్సల్టేషన్ బాటపట్టారు. కోవిడ్, ఇతర రుగ్మతల బారిన పడిన వారికి ఫోన్, వాట్సప్ ద్వారా చికిత్సలను సూచిస్తున్నారు. కొందరు వైద్యులు ఆస్పత్రులు తెరుస్తున్నా రోగుల్ని 6 అడుగుల దూరం నుంచే పరిశీలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ఈ కారణంగా చాలామంది రోగులు ఆస్పత్రులకు వెళ్లకుండా ఫోన్ ద్వారానే వైద్యులను సంప్రదించి.. వారు సూచించిన ల్యాబ్ పరీక్షలు చేయించుకుని చికిత్స పొందుతున్నారు.
కరోనా స్వల్ప లక్షణాలున్న వారు ఆందోళన చెంది ఆస్పత్రుల్లో బెడ్స్ కోరం తిరగటం కంటే ఆన్‌లైన్ పద్ధతిలోనే చికిత్స చేయించుకుంటున్నారు. పలువురు వైద్యులు తమ ఫోన్ నంబర్ ఇచ్చి.. డిజిటల్ విధానంలో ఫీజు చెల్లిం చగానే లైన్‌లోకి వచ్చి రోగికి వైద్య సలహాలు ఇస్తు న్నారు. పరీక్ష నివేదికలను వాట్సప్ ద్వారా రప్పిం చుకుని పరిశీలించి చికిత్స సూచిస్తున్నారు. ఈ విధానం వల్ల వైద్యుడి కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా కన్సల్టేషన్ త్వరగా పూర్తయిపోతోంది. అత్యవసర కేసుల్లో ఈ విధానం పనికిరాదని, అలాంటి వారు ఆన్‌లైన్ వైద్యం కోసం ప్రయత్నిస్తే ప్రాణాల మీదకు వస్తుందని పలువురు చెబుతున్నారు.
లాభాలివీ..
ఆస్పత్రులకు వెళ్లి గంటల తరబడి వేచి ఉండటం వల్ల పక్క వారికి కరోనా ఉంటే అది మనకు సోకుతుందనే భయం ఉండదు. తేలికపాటి లక్షణాలకే ప్రయాసపడి వెళ్లి వైద్యుల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. వైద్యులు రిపోర్టులు చూసి రోగులకు ధైర్యం చెబుతున్నారు. దీనివల్ల తమకు ప్రాణా పాయం లేదనే ధైర్యం రోగుల్లో వస్తోంది. తాము చెప్పదలుచుకున్న విషయాలను ముందుగా రాసుకుని చెప్పడానికి వీలుంటుంది. వైద్యుడు ఫోన్ నంబర్ అందుబాటులో ఉంటుంది కాబట్టి అత్యవసరమైతే ఫోన్ చేసి సంప్రదించవచ్చు. కరోనా తొలి దశలోనే సాధారణ, మధ్య తరగతి వారికి ఆన్‌లైన్ వైద్యం అందుబాటులోకి వచ్చింది.
అన్ని వేళలా మంచిది కాదు
ఆన్‌లైన్ వైద్యం అన్నివేళలా మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. రోగుల్ని చూసిన తరువాత వైద్యుడు అంచనాకు వచ్చి వైద్యం ప్రారంభించాలి. తొలుత స్వల్ప లక్షణాలు కనిపించినా తరువాత రోగం ముదిరే ప్రమాదం ఉంది. అప్పుడు ఆస్పత్రికి వెళ్లి చేరినా రోగం కంట్రోల్ కాకపోవచ్చు. రోగి తన లక్షణాలన్ని చెప్పలేకపోతే వైద్యడు సరిౖయెన మందు ఇవ్వకపోవచ్చు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఉపయుక్తం
ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్ వైద్యం ఉపయుక్తంగా వుంది. అయితే, అన్ని వేళలా ఇది పనిచేయదు. అమెరికాలో టెలీ మెడిసిన్ విధానం ఉంది. ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. ఆన్‌లైన్ వైద్యంలో అలా జరగడం లేదు. ఈ విధానం ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉంది.
– డాక్టర్ మనోజ్‌కుమార్, జనరల్ ఫిజీషియన్, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment