
సాక్షి, అమరావతి: బడి గంట మోగిన రోజే పిల్లలకు పుస్తకాల నుంచి యూనిఫామ్ దాకా ఉచితంగా అందచేస్తూ చదువుల పట్ల ఆసక్తిని పెంపొందించిన చరిత్ర గతంలో ఎప్పుడైనా ఉందా? తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాకానుక ద్వారా ఇందుకు చొరవ చూపారు. ఒకపక్క పిల్లలను బడికి పంపించే తల్లులకు అమ్మ ఒడి ద్వారా డబ్బులిసూ్తనే మరోపక్క జగనన్న విద్యాకానుక కిట్ల ద్వారా నాణ్యమైన వస్తువులను ఉచితంగా సమకూరుస్తున్నారు.
కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అన్ని సదుపాయాలతో తీర్చిదిద్దారు. ఇవన్నీ ఎల్లో మీడియాకు కంటగింపుగా మారాయి. ఇక యథాప్రకారం కిట్లలో కిటుకు.. విద్యాకానుక కిట్లు వృథా అంటూ బురద చల్లింది. ఆడిట్ అనంతరం తలెత్తిన ప్రశ్నలకు సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకోవడం సహజమే. కాకపోతే ఆ ప్రక్రియ పూర్తి కాకుండానే ఈనాడు తన పాఠకులకు ఆదరబాదరగా యథా ప్రకారం అబద్ధాలను వడ్డించేసింది!!
ఆరోపణ: విద్యార్థుల వాస్తవ సంఖ్యను పరిగణలోకి తీసుకోకుండా అంచనాలకు మించి టెండర్లు పిలి చారు. మిగిలిన కిట్లు ఏం చేయాలో ఆలోచించలేదు.
వాస్తవం: 2023–24లో 43.10 లక్షల మంది విద్యార్థులు ఉండవచ్చనే అంచనాలతో ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. టెండర్లు పిలిచినా సరఫరాదారులకు కేవలం 39.96 లక్షల కిట్లకు మాత్ర మే సప్లయ్ ఆర్డర్ ఇచ్చారు. గతేడాది మిగిలిన (జేవీకే 3) సామగ్రిని ఈ ఏడాది జేవీకే 4లో వినియోగించారు. మిగులు వివరాలన్నీ జేవీకే యాప్‌లో నమోదు చేశారు.
ఆరోపణ: పాఠశాల విద్యాశాఖ అస్తవ్యస్థ నిర్ణయాలతో ప్రజాధనం వృథా అయినట్లు ఆడిట్ విభాగం నిగ్గు తేల్చింది.
వాస్తవం: విద్యాశాఖ, ఆడిటింగ్ విభాగానికి మధ్య సమాచార మార్పిడి అంశాలను పూర్తిగా వక్రీకరించి కథనాలను ప్రచురించారు. ఆడిట్ విభాగం వ్యక్తం చేసిన సందేహాలపై పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇచ్చిన అనంతరం పునఃపరిశీలన జరిపి నివేదికను ఖరారు చేస్తుంది. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే తప్పులు జరిగిపోయాయంటూ ఈనాడు తీర్పులిచ్చేసింది.
ఆరోపణ: జ్యుడిషియల్ ప్రివ్యూ నిబంధనను ట్యాబ్‌ల కొనుగోలులో పాటించలేదు.
వాస్తవం: ఇది ముమ్మాటికీ అబద్ధం. ట్యాబ్‌ల కొనుగోలులో ప్రభుత్వం జ్యుడిషియల్ ప్రివ్యూ నిబంధనను తు.చ. తప్పకుండా పాటించింది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా ఉంది. జ్యుడిషియల్ ప్రివ్యూ ప్రక్రియ పాటించిన తర్వాతే కొనుగోలు చేస్తున్నారు.
ఆరోపణ:ట్యాబుల మెమరీ కార్డుల్లోకి కంటెంట్ లోడ్ కోసం రూ.22.04 కోట్లు అదనంగా ఖర్చు చేశారు.
వాస్తవం: దేశంలో ఎక్కడా లేని విధంగా పాఠశాలల్లో డిజిటలైజేషన్ ప్రక్రియను ప్రభుత్వం చేపడుతోంది. విద్యార్థులకు, టీచర్లకు ట్యాబులు పంపిణీ చేసింది. కేవలం పరికరాలు కొనడమే కాకుండా పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా చర్యలు తీసుకుంది. ఇంటర్నెట్, సరైన బ్యాండ్ విడ్త్ లేకున్నా, ఇంటర్నెట్ ఆధారిత సాంకేతిక లోపాలు తలెత్తినా ట్యాబులు ఉపయోగపడేలా ఆఫ్‌లైన్ మోడ్‌లో పాఠాలు నేర్చుకునేలా మెమరీ కార్డులు అమర్చి వీడియో పాఠ్యాంశాలను లోడ్ చేసి ఇచ్చింది. స్కూలు ముగిశాక ఇంట్లో ఇంటర్నెట్ లేకున్నా విద్యార్థులు పాఠాలు పునశ్చరణ చేసుకోవడానికి మెమరీ కార్డు, వీడియో పాఠ్యాంశాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
ఆరోపణ: ఐఎఫ్‌పీ ప్యానెళ్లు, స్మార్ట్ టీవీలు వచ్చాక గ్రీన్ చాక్‌బోర్డులు ఎందుకు?
వాస్తవం: ఐఎఫ్‌పీ ప్యానెళ్లు, స్‌మ్రాŠ్ట టీవీలకు అటు ఇటుగా గ్రీన్ చాక్ బోర్డులు ఉన్నాయి. అవసరమైనప్పుడు సంప్రదాయ పద్ధతుల్లో పాఠ్యాంశాలను బోధించినప్పుడు వీటిని టీచర్లు వినియోగించుకుంటారు. ఇందులో ఈనాడుకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? అవి వృథా అవుతాయని ఏ విధంగా
నిర్ణయానికి వచ్చారు?
ఆరోపణ: ఏటా అదనంగా విద్యాకానుక కిట్లు కొనడంతో ప్రజాధనం వృథా అయింది.
వాస్తవం ఇదీ: జేవీకే–3లో మిగిలిన సామగ్రిని 2023–24లో వినియోగిస్తున్నారు. 2022–23లో 5,46,923 నోట్ బుక్స్ మిగలడంతో 2023–24లో (జేవీకే 4) సత్యసాయి, అన్నమయ్య, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పంపిణీ చేశారు. ఆ మేరకు జేవీకే 3 మిగులును పరిగణలోకి తీసుకుని ఈ ఏడాది వాస్తవ విద్యార్థుల సంఖ్య ఆధారంగా విద్యాశాఖ సప్లయ్ ఆర్డర్ ఇచ్చింది.
బెల్టులు: గతేడాది మిగిలిన 1,46,485 బెల్టులను కర్నూలు, కోనసీమ, అన్నమయ్య జిల్లాల్లో పంపిణీ చేసింది.
బూట్లు: గతేడాది 69,181 బూట్లు మిగిలాయి. వీటిలో బాగున్న వాటిని సైజుల వారీగా జేవీకే యా‹³లో అప్‌లోడ్ చేసి పంపిణీ చేశారు. పాడైన బూట్లను సరఫరాదారులకు తిరిగి పంపించారు.
యూనిఫాం: 2,56,797 మిగులు యూనిఫాంలను కేజీబీవీలకు, ఏపీ మోడల్ స్కూల్, ఏపీఆర్‌ఎస్ స్కూళ్లల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు పంపిణీ చేశారు.
డిక్షనరీలు: గతేడాది మిగిలిన 23,679 పిక్టోరియల్, 29,488 ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలను ఈదఫా పంపిణీ చేశారు.
బ్యాగులు: గత ఏడాది బ్యాగుల్లో 6,13,003 పాడైపోవడంతో సరఫరాదారులకు వెనక్కి పంపి సొంత ఖర్చుతో రీప్లేస్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment