సాక్షి, అమరావతి: అబద్దపు పాత్రికేయంలో చాలా డిగ్రీలు చేసిన రామోజీ దిగజారుడు కథనాలలో ఇది కూడా ఒకటి. పేదల పక్షాన నిలబడ్డ జగన్ ప్రభుత్వంపై అక్కసుతో ప్రజల్లో ఏదో అలజడి సృష్టించాలన్న తాపత్రయంలో అవాస్తవాలను ఏర్చికూర్చి అల్లిన ఓ చిల్లర కథనం. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను అంతే పారదర్శకంగా ప్రజలకు అందిస్తున్న వారధులు వలంటీర్లు. అలాంటి వలంటీర్ల వ్యవస్థపై ఈనాడు పత్రికలో ‘‘మనవారు కాదా? అనర్హత వేటు వేయండి..!’’ శీర్షికన ఓ అబద్దపు కథనాన్ని వండి వార్చారు.
బాబు జమానాలో జన్మభూమి కమిటీలు చేసిన అక్రమాలను ఏనాడూ పట్టించుకోని ఈనాడు పత్రిక.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పారదర్శకంగా ప్రజలకు నేరుగా అందించేందుకు ఉపయోగపడుతున్న వలంటీర్లపై మాత్రం తప్పుడు వార్తలను ప్రచురించడం ఏ స్థాయి పాత్రికేయమో వారికే తెలియాలి. విజయవాడ మున్సిపాలిటీ పరిధిలో ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద జరిగిన కేటాయింపులపై విషం చిమ్ముతూ వలంటీర్లపై కూడా ఈనాడు ఆరోపణలు చేసింది. ఇందులో వాస్తవాలేంటో చూద్దాం..
ఈనాడు: అమరావతిలో నివేశన స్థలాలు కేటాయిస్తూ.. మరోవైపు కొంతమందికి రద్దు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మనవారు కాదా.. అయితే తొలగించండి అంటూ అధికార పార్టీ నేతలు జోక్యం చేసుకుని వలంటీర్లతో తొలగింపు ప్రక్రియను చేపట్టారు. అందుకోసం 300 యూనిట్ల విద్యుత్ వాడుతున్నారని, సొంతిల్లు ఉందని తేలిందనీ కొర్రీలు పెడుతున్నారు.
వాస్తవం: రాష్ట్రంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయింపునకు ప్రభుత్వం 2020లోనే ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పేరుతో కనీవినీ ఎరుగని రీతిలో పథకాన్ని రూపొందించింది. అసలైన నిరుపేదలకు ఇల్లు దక్కాలని రెవెన్యూ శాఖ ద్వారా ‘ఆరు’ ప్రమాణాలను నిర్దేశించింది.
► భూమి: మూడు ఎకరాల కంటే తక్కువ మాగాణి లేదా 10 ఎకరాల కంటే తక్కువ మెట్ట భూమి లేదా రెండూ కలిసి 10 ఎకరాల లోపు ఉండాలి
► విద్యుత్ వినియోగం: గడిచిన ఏడాదిలో నెలకు సగటున 300 యూనిట్లు కంటే తక్కువగా
ఉండాలి
► కుటుంబ ఆదాయం: గ్రామీణ ప్రాంతంలో నెలకు రూ.10 వేలు, పట్టణాల్లో రూ.12 వేలు ఉండాలి
► పట్టణాల్లో ఆస్తులు: 1000 చ.అడుగుల్లోపు ఉండాలి
► జీఎస్టీ: ఏడాదికి రూ.12 లక్షల కంటే ఎక్కువ టర్నోవర్ ఉండకూడదు..
వీటితో పాటు ప్రత్యక్ష లబ్ధిదారు ప్రభుత్వ ఉద్యోగి, ప్రభుత్వ పెన్షనర్ కాకూడదు, ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు అనే నిబంధనలను రాష్ట్రమంతా అమలు చేస్తోంది. అమరావతి పరిధిలోని లబ్ధిదారులను కూడా అదే తరహాలో ఎంపిక చేశారు.
ఈనాడు: అమరావతి పరిధిలోని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇలా 5,500 మంది లబ్ధిదారుల తొలగింపునకు రంగం సిద్ధమైంది. వీరిలో అత్యధికులు విజయవాడ సెంట్రల్, తూర్పు నియోజకవర్గాలకు చెందిన వారే అధికం.
వాస్తవం: ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద విజయవాడ మునిసిపాలిటీ నుంచి సీఆర్డీఏ ప్రాంతంలో 24,630 మంది లబ్ధిదారులకు గతంలోనే ప్లాట్లు కేటాయించారు. అయితే..
మూడు నియోజకవర్గాల్లోను సొంతిల్లు ఉన్నవారు 1910 మంది, పూర్తిగా వలసపోయిన వారు 1123 మంది, స్థలం వద్దనుకున్నవారు 917 మంది, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారు 362 మంది, ప్రభుత్వం నిర్దేశించిన ‘ఆరు’ ప్రమాణాలు లేనివారు 383 మంది, పేదరిక రేఖకు పైన ఆదాయం ఉన్నవారు 320 మంది, సొంత ఇంటి స్థలం ఉన్నవారు 126 మంది, రెగ్యులేషన్ జీవోల పరిధిలోకి వచ్చినవారు 124 మంది, చనిపోయినవారి కుటుంబంలో చట్టబద్ధమైన వారసులు లేనివారు 106 మంది, ఎంపికైన కుటుంబంలో ఒక్కరే ఉండి చనిపోయినవారు 17 మంది, వన్‌టైమ్ సెటిల్‌మెంట్ కింద ఎంపికైనవారు ఒక్కరు.. మొత్తం 5,389 మంది అనర్హులను గుర్తించారు. మిగిలిన 19,241 మంది లబ్ధిదారుల్లో సెంట్రల్ నియోజకవర్గంలో 9,515 మంది, ఉత్తరంలో 3605, పశ్చిమలో 6121 మంది ఉన్నారు.
సీఆర్డీఏ ప్రాంతంలో నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించరాదని టీడీపీ నేతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పంపిణీ ఆలస్యమైంది. ఇప్పుడు 19,241 మందికి వారి పేరు, ఫొటో, షెడూŠయ్‌ల్ ప్లాట్ నంబర్.. సరిహద్దులతో కేటాయింపు పట్టాలను ముఖ్యమంత్రి సందేశంతో సహా తయారు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో కలెక్టర్, కమిషనర్, జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతోంది. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 28వేల టిడ్కో ఇళ్లను నిర్మించాలని నిర్ణయించి పరిపాలనా పరమైన అనుమతులు కూడా తీసుకున్నారు.
అందుకోసం 100 ఎకరాలు అవసరమని, కొనుగోలుకు ఎకరా ఒక కోటి చొప్పున 100 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ అంత డబ్బు లేదంటూ చంద్రబాబు చేతులెత్తేశారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయవాడ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూమిని కేటాయించి 6,576 టిడ్కో ఇళ్లను నిర్మిస్తోంది. ఇవిగాక, సీఆర్డీఏ పరిధిలో కేటాయించిన టిడ్కో ఇళ్లను వద్దనుకున్నవారిని వడపోసి మిగిలినవారికి టిడ్కో ఇళ్లను సైతం కేటాయించింది.
Fact Check: దిగజారుడు పాత్రికేయానికి మరో మచ్చుతునక
Published Mon, May 15 2023 4:57 AM | Last Updated on Mon, May 15 2023 2:27 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment