
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను నూతన నంబర్లతో నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 08117 నంబరు గల హౌరా–మైసూర్ ఎక్స్‌ప్రెస్ 2022 జనవరి 7వ తేదీ నుంచి 08017 నంబరుతో నడుస్తుందని పేర్కొన్నారు. 08118 నంబరు గల మైసూర్–హౌరా రైలు జనవరి 9వ తేదీ నుంచి 08018 నంబరుతో నడుస్తుందని తెలిపారు. 08645 నంబరు గల షాలిమార్–హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ జనవరి 2వ తేదీ నుంచి 08045 నంబరుతో నడుస్తుందని పేర్కొన్నారు. 08646 నంబరు గల హైదరాబాద్–షాలిమార్ రైలు జనవరి 4వ తేదీ నుంచి 08046 నంబరుతో నడుస్తుందని వివరించారు.