కోతులను భయపెడుతున్న వికృతమైన తలబొమ్మ
పలమనేరు: మామిడి తోటలో బీభత్సం సృష్టిస్తున్న వానరాల నుంచి పండ్లను కాపాడుకునేందుకు ఆ రైతు వినూత్న ప్రయత్నం చేసి సఫలీకృతుడయ్యాడు. పలమనేరు మండలంలోని రంగినాయునిపల్లికి చెందిన సుబ్రమణ్యం నాయుడుకు 20 ఎకరాల మామిడి తోపుంది. ఇప్పుడు కాయలు పక్వానికి వచ్చి త్వరలో కోత కోయాల్సి ఉంది.
కోతుల కారణంగా పంటను ఎలా కాపాడుకోవాలనుకునే క్రమంలో కర్ణాటకలోని ముళబాగిలు ప్రాంతంలో వానరాలు భయపడే బొమ్మలను విక్రయిస్తున్నారని తెలుసుకున్నాడు. అక్కడకు వెళ్ళి రూ.500 పెట్టి భయంకరమైన, వికృతమైన తల ఆకారాన్ని తెచ్చుకున్నాడు. దాన్ని రైతు తలకు బిగించుకొని కోతుల వద్దకెళితే అవి భయపడి పారిపోతున్నాయి. ఆ వికృతమైన తలవైపునకు కోతులు అసలు చూడడం లేదని రైతు తెలిపాడు. కోతులను తరిమేస్తున్న ఈ బొమ్మను చూసేందుకు చుట్టుపక్క రైతులు కూడా ఆసక్తిగా వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment