గంటల వ్యవధిలో తండ్రి, కొడుకు మృతి | Father Died Hours After Son Death In Prakasam | Sakshi
Sakshi News home page

గంటల వ్యవధిలో తండ్రి, కొడుకు మృతి

Jan 7 2021 9:14 AM | Updated on Jan 7 2021 9:14 AM

Father Died Hours After Son Death In Prakasam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, బల్లికురవ(ప్రకాశం): కొడుకు అస్వస్థతకు గురి కావడంతో తీవ్ర ఆవేదన చెందిన తండ్రి 15 రోజులుగా మంచం పట్టాడు. ఆ దిగులుతోనే తండ్రి చనిపోగా తండ్రి లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఇప్పటికే తీవ్ర అస్వస్థతతో ఉన్న కుమారుడు గంటల వ్యవధిలో తనువు చాలించాడు. ఈ హృదయ విదారక సంఘటన బల్లికురవ ఎస్సీ కాలనీలో బుధవారం వెలుగు చూసింది. వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే జొన్నలగడ్డ దిబ్బయ్య (72)కు భార్య, కుమారుడు ఉన్నారు.  అనారోగ్యంతో భార్య గతంలోనే చనిపోయింది. కుమారుడు బుల్లెయ్య (53), కోడలు దిబ్బయ్యను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.

ఇటీవల బుల్లెయ్యకు ఊపిరి తిత్తులు దెబతినడంతో వైద్యశాలల చుట్టూ తిరగుతున్నాడు. అయినా వ్యాధి తగ్గలేదు. విషయం తెలుసుకున్న తండ్రి మంచంపట్టి ఆ దిగులుతోనే చనిపోయాడు. తనకు జన్మనిచ్చిన తండ్రి ఇక లేడన్న విషయాన్ని జీర్ణించుకోలేని కుమారుడు కూడా తనువు చాలించాడు. బుధవారం ఉదయం తండ్రి అంత్యక్రియులు, ఆ తర్వాత కుమారుడి అంత్యక్రియలు కుటుంబ సభ్యులు ముగించారు. బుల్లెయ్యకు భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుల బంధువుల్లో విషాద ఛాయలు నెలకొన్నాయి. (చదవండి: యూపీలో మరో నిర్భయ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement