
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు పోలీస్ శాఖ స్పెషల్ డ్రైవ్ చేపట్టిందని, ఇందుకు ప్రజలు సహకరించాలని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఒక ప్రకటన చేస్తూ.. కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా నిబంధనల్ని పౌరులంతా కచి్చతంగా పాటించాలని కోరారు. కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచించడంతో కఠిన చర్యలు చేపట్టామన్నారు. కరోనా నియంత్రణకు సంబంధించిన నియమాలను ప్రజలకు తెలియజేసేలా నగర పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో మాసు్కలు ధరించని వారికి, కోవిడ్ నియమావళిని పాటించని వారికి పెద్ద మొత్తంలో జరిమానాలు విధించేలా ఆదేశాలిచ్చినట్టు తెలిపారు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు
అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ ప్రయాణాలు చేయవద్దని, నిత్యావసర సరుకులు, అత్యవసరాల కోసమే బయటకు రావాలని డీజీపీ విజ్ఞప్తి చేశారు. వేడుకలు, విందులు, వినోదాలు వంటి వాటిని సాధ్యమైనంత తక్కువ మందితో జరుపుకోవడం, వీలైతే వాటిని కొన్ని రోజులు వాయిదా వేసుకోవడం మంచిదని సూచించారు. బయటకు వస్తే తప్పనిసరిగా మాసు్కలు ధరించడం, శానిటైజర్ వాడటం, భౌతిక దూరం పాటించటం వంటివి విధిగా పాటించాలని కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో భౌతిక దూరం ఉండేలా విద్యార్థులను కూర్చోబెట్టాలని, విద్యార్థులు కోవిడ్ నియమాలు కచి్చతంగా పాటించేలా చూడాలని పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు, విద్యాసంస్థల అధికారులకు సూచించారు.
ఒకే రోజు 18,565 మందికి ఫైన్
కరోనా కట్టడికి రంగంలోకి దిగిన పోలీసులు మాస్‌్కలు ధరించని వాహన చోదకులకు జరిమానాలు విధిస్తున్నారు. శనివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి మాసు్కలు ధరించని 18,565 మందికి రూ.17,33,785 జరిమానా విధించినట్టు డీజీపీ కార్యాలయం తెలిపింది. విశాఖపట్నం నగరంలో 1,184 మందికి రూ.1,16,700, తూర్పు గోదావరి జిల్లాలో 2,299 మందికి రూ.1,78,050, విజయవాడలో 2,106 మందికి రూ.1,93,850, గుంటూరు అర్బన్‌లో 844 మందికి రూ.1,05,720 జరిమానా విధించారు.
Comments
Please login to add a commentAdd a comment