ఈ చేప ధర రూ. 4.30 లక్షలు! | This Fish Priced At Rs 4 lakhs In Kakinada | Sakshi
Sakshi News home page

ఈ చేప ధర రూ. 4.30 లక్షలు!

Published Sun, Feb 6 2022 8:57 AM | Last Updated on Sun, Feb 6 2022 3:24 PM

This Fish Priced At Rs 4 lakhs In Kakinada - Sakshi

ఆ చేప...మత్స్యకారుడి వలకు చిక్కితే కాసుల పంటే. చాలా అరుదుగా లభ్యమయ్యే ఈ చేప దొరికితే మత్స్యకారులు పండగ చేసుకుంటారు. తూర్పు గోదావరి జిల్లా

ఆ చేప...మత్స్యకారుడి వలకు చిక్కితే కాసుల పంటే. చాలా అరుదుగా లభ్యమయ్యే ఈ చేప దొరికితే మత్స్యకారులు పండగ చేసుకుంటారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మత్స్యకారులకు అలాంటి పండగే ఇది. ఒక మత్స్యకారుడి వలకు 30కిలోల పైబడి బరువు కలిగిన కచ్చిడి మగ చేప చిక్కింది. చేప కడుపులో ఉండే బ్లాడర్‌కు మంచి గిరాకీ ఉండడంతో ఈ చేప రూ.4.30 లక్షలకు కాకినాడలో అమ్ముడుపోయింది.  ఇంత ధర పలకడం ఇదే తొలిసారని వ్యాపారులు తెలిపారు. 
– కాకినాడ రూరల్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement