12 నుంచి ఇంటర్‌ సెకండియర్‌ ఆన్‌లైన్‌ తరగతులు | Inter Second Year Online classes From 12th July | Sakshi
Sakshi News home page

12 నుంచి ఇంటర్‌ సెకండియర్‌ ఆన్‌లైన్‌ తరగతులు

Published Wed, Jul 7 2021 3:57 AM | Last Updated on Wed, Jul 7 2021 8:15 AM

Inter Second Year Online classes From 12th July - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: ఏపీలో ఇంటర్‌ సెకండియర్‌ ఆన్‌లైన్‌ తరగతులు ఈ నెల 12 నుంచి ఆరంభం కానున్నాయి. ఇంటర్‌ సెకండియర్‌ 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి తాత్కాలిక అకడమిక్‌ క్యాలెండర్‌ను ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రకటించింది. ఏపీలోని అన్ని కాలేజీలకు ఈ మేరకు సమాచారాన్ని పంపింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 213 పని దినాలు ఉండనున్నాయి. ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో బోధన, బోధనేతర సిబ్బంది ఈ నెల 12 నుంచి కాలేజీలకు హాజరు కావాలని బోర్డు ఆదేశాలు జారీ చేసింది.

అకడమిక్‌ క్యాలెండర్‌ వివరాలు..
► ఈ నెల 12 నుంచి అక్టోబర్‌ 16 వరకు అకడమిక్‌ ఇయర్‌ ఫస్ట్‌ టర్మ్‌  
► ఆగస్టులో మొదటి యూనిట్‌ టెస్టు
► సెప్టెంబర్‌లో రెండో యూనిట్‌ టెస్టు అక్టోబర్‌ 1 నుంచి 8 వరకు అర్థ సంవత్సర పరీక్షలు
► అక్టోబర్‌ 9 నుంచి 17 వరకు ఫస్ట్‌ టర్మ్‌ సెలవులు
► అక్టోబర్‌ 18 నుంచి కాలేజీల పునఃప్రారంభం
► అక్టోబర్‌ 18 నుంచి 2022 ఏప్రిల్‌ 23 వరకు అకడమిక్‌ ఇయర్‌ సెకండ్‌ టర్మ్‌
► నవంబర్‌లో 3వ యూనిట్‌ టెస్టు
► డిసెంబర్‌లో 4వ యూనిట్‌ టెస్టు
► 2022 జనవరి 8 నుంచి 16 వరకు సెకండ్‌ టర్మ్‌ సెలవులు
► జనవరి 17న కాలేజీల పునఃప్రారంభం
► ఫిబ్రవరి మొదటి వారంలో ప్రీ ఫైనల్‌ పరీక్షలు
► ఫిబ్రవరి చివరి వారం నుంచి ప్రాక్టికల్స్‌
► మార్చి మొదటి వారంలో థియరీ పరీక్షలు ఆరంభం  ఏప్రిల్‌ 23వ తేదీ చివరి పనిదినం
► ఏప్రిల్‌ 24 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు
► మే చివరిలో అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు
► జూన్‌ 1 నుంచి 2022–23 విద్యా సంవత్సరానికి కాలేజీల పునఃప్రారంభం
► అన్ని ఆదివారాలు, రెండో శనివారాలు సెలవు దినాలు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement