సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప‍్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భేటీ ముగిసింది. అనంతరం అనిల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘రీజనల్ కో-ఆర్డినేటర్‌గా నియమించినందుకు సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు చెప్పేందుకు వచ్చాం. మేమంతా సీఎం జగన్ సైనికులం.. ఆయన ఏది చెబితే అది చేస్తాం. ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి, నాకూ మధ్య ఏమీ లేదు. మా ఇద్దరి మధ్య సమస్యలు ఉన్నాయని నేను చెప్పలేదు. అందరం కలిసి కట్టుగా పనిచేస్తాం తప్ప మా పార్టీలో వర్గాలు అంటూ ఉండవు.
మేమంతా సీఎం జగన్ వర్గం. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏ పార్టీదైనా ఫ్లెక్సీలు తీసేసారు అంటే అది మున్సిపాలిటీ వాళ్ళు తీసేసారు తప్ప నేను చేసింది కాదు. నేను సీఎం జగన్ నీడలో పెరిగిన వ్యక్తిని.. ఆయన బాగుండాలని కోరుకుంటాను. సీఎం జగన్ కోసం రక్తం దారపోసేందుకు కూడా సిద్ధంగా ఉన్నా. మా బీసీలకు ఆయనిచ్చిన ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి, అట్టడుగు స్థాయికి తీసుకెళ్తాం. ఇప్పుడు ఎవరైతే 14 మంది పదవులు కోల్పోయారో మేమంతా మళ్లీ మంత్రులం అవుతాం. 90 శాతం మంది ఎమ్మెల్యేల్లో అందరం సీఎం జగన్ ఫొటో పెట్టుకుని గెలవాల్సిందే. ముఖ్యమంత్రికి మేము బలం అవ్వాలి కానీ బలహీనత కాకూడదు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment