గుంటూరు మెడికల్: ఆసుపత్రిలో 24గంటలూ రోగి పడకవద్దే ఉండి చిరునవ్వుతో వైద్యసేవలందిస్తూ వ్యాధి నుంచి రోగి కోలుకోవటంలో నర్సులు కీలకపాత్ర పోషిస్తారు. అనారోగ్యంతో ఉన్న వారిని సొంతవారే ఈసడించుకుంటున్న నేటి దినాల్లో రోగులకు ఆప్యాయంగా సేవలు అందిస్తూ మానవత్వపు విలువలున్నాయని నిరూపించుకుంటుంది నర్సులు మాత్రమే అనటంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. కాలిన గాయలు... కుళ్లిన శరీరభాగాలు... గాయపడి, రక్తమోడుతూ దుర్గంధం వెదజల్లే శరీరాలకు నర్సులు సేవలను అందిస్తారు. æసేవకు ప్రతిరూపంగా చెప్పుకొనే నర్సుల దినోత్సవాన్ని ఏటా మే 12న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.
ఇదీ నేపథ్యం..
లేడీ విత్ ది ల్యాంప్ గా పేరు గాంచిన ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820 మే 12న ఇటలీలో జని్మంచారు. 1854–56 లో క్రిమియాలో ఘోర యుద్ధం జరిగింది. ఫ్లారెన్స్ నైటింగేల్ తోటి నర్సుల సహాయంతో యుద్ధంలో గాయాలైన సైనికులకు నిరుపమానమైన సేవలందించింది. వారికి ధైర్యమూ చెప్పింది. నర్సులు చేసిన సేవలవలన యుద్ధంలో మరణించే రోగుల సంఖ్య బాగా తగ్గింది. యుద్ధంలో దెబ్బతిన్న ప్రతి సైనికుడికి తాను కోలుకుంటానన్న ఆశ చిగురింపచేసేలా ఆమె వైద్య సేవలందించింది. ఆమె సేవలను గుర్తించి ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా మే12న ఫ్లారెన్స్ నైటింగేల్ జయంతి రోజున నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారు.
నర్సులు అందించే సేవలు...
ఆసుపత్రిలో డాక్టర్ల తరువాత అత్యంత కీలకమైన పాత్ర నర్సులదే. ఆసుపత్రికి నర్సులు వెన్నుముక లాంటివారు. నిత్యం తెల్లటి వ్రస్తాలు ధరించి రోగుల పడకల వద్దే ఉంటూ వారికి వైద్య సాయం అందించడంతోపాటు, మానసిక స్థైర్యాన్ని సైతం కలి్పస్తుంటారు. వార్డులో ఉంటున్న రోగులకు కావాల్సిన మందులను పంపిణీ చేయటం, వార్డులో ఉండే రోగులకు కావాల్సిన మందులను మెడికల్ స్టోర్ నుంచి ఇండెంట్ పెట్టి తెప్పించటం, రోగుల పడకలను శుభ్రంగా ఉండేలా చేయించటం, ఫ్లూయిడ్స్ ఎక్కించటం, వ్యాధినిర్ధారణ పరీక్షలకు రోగిని పంపించటం, వార్డులో వర్క్‌షాపునకు సంబంధించిన పనులు చూడటం, యూనిట్ చీఫ్, అసిస్టెంట్ డాక్టర్లు రోగులను పరీక్షించేందుకు వచ్చినప్పుడు వారి వెంట ఉండి సహాయం చేయటం, వార్డు శుభ్రంగా ఉండేలా చూడటం తదితర పనులను నర్సులు చేస్తుంటారు. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు, గర్భణులకు టీకాలు వేయటం, కాన్పులు చేయటం కూడా నర్సులే చేస్తారు.
నర్సింగ్ ప్రాధాన్యత గుర్తించిన ప్రభుత్వం...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. గుంటూరు జిల్లాలో టీచింగ్ ఆసుపత్రి మొదలు పీహెచ్‌సీ వరకు పలు నర్సింగ్ సిబ్బంది పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లాలో 300 మంది కాంట్రాక్టు స్టాఫ్ నర్సులు పలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో విధుల్లో చేరారు. గుంటూరు జీజీహెచ్‌లో 250 పోస్టులు ఒకేసారి మంజూరు చేసిన ప్రభుత్వం తద్వారా నర్సింగ్ సేవలు మెరుగ్గా అందేలా చర్యలు తీసుకుంది. డాక్టర్ వైఎస్సార్ విల్లేజ్ హెల్త్ క్లినిక్‌లలో సైతం బీఎస్సీ నర్సింగ్ చదివిన వారిని మిడ్‌లెవల్ హెల్త్ ప్రొవైడర్ పేరుతో రిక్రూట్‌మెంట్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో సైతం మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
నర్సింగ్ పోస్టులు పెంచినందుకు కృతజ్ఞతలు
అధికారంలోకి రాగానే గుంటూరు జీజీహెచ్‌లో 250 స్టాఫ్‌నర్సుల పోస్టులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. అధిక సంఖ్యలో పోస్టులు మంజూరు చేయడం ద్వారా రోగులకు మెరుగైన నర్సింగ్ సేవలు అందిస్తున్నాం. పలు రకాల ఇన్‌ఫెక్షన్‌లతో బాధపడుతూ చికిత్స కోసం వచ్చే రోగులకు వైద్య సేవలు అందిస్తున్నాం. వారు వ్యాధి నుంచి కోలుకుని ఇంటికి వెళ్లి మేము అందించిన సేవలను గుర్తించి ఫోన్లు చేస్తుంటారు. నా తల్లి చంద్ర లీలావతి, పిన్ని సుగుణ కుమారి, ఇరువురు కూడా నర్సింగ్ వృత్తిలో పనిచేశారు. పిన్ని ప్రొత్సాహంతో నర్సింగ్ వృత్తిలో ప్రవేశించాను. పలు ఆసుపత్రుల్లో వివిధ హోదాల్లో రోగులకు సేవలు అందించడం ఎంతో సంతృప్తినిచ్చింది.
– కర్రెద్దుల ఆషా సజని,
గుంటూరు జీజీహెచ్ నర్సింగ్ సూపరింటెండెంట్ పీహెచ్‌సీకి ముగ్గురు నర్సులు
గతంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్కొక్కరు మాత్ర మే నర్సింగ్ సిబ్బంది ఉండేవారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేప ట్టగానే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నర్సింగ్ సే వలు మెరుగుపడేలా చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ప్రతి పీహెచ్‌సీలో ముగ్గురు నర్సులను నియమించారు. అంతేకాకుండా సబ్ సెంటర్‌లు, సచివాలయాల్లో ఉండే ఏఎన్‌ఎంలకు సైతం జీఎన్‌ఎం శిక్షణ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది.
– డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు, డీఎంహెచ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment