
మంత్రి ఆదిమూలపు సురేశ్
సాక్షి, కంకిపాడు: జగనన్న విద్యాకానుక పథకాన్ని ఈ నెల 5న సీఎం వైఎస్ జగన్ కృష్ణా జిల్లా కంకిపాడు జెడ్పీ పాఠశాలలో ప్రారంభిస్తారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. అక్కడ ఎంపీపీ ఆదర్శ పాఠశాలలో నాడు–నేడు పనులను సీఎం పరిశీలిస్తారన్నారు. శుక్రవారం కంకిపాడు, కోలవెన్నుల్లో ఎంపీపీ ఆదర్శ పాఠశాలలు, పునాదిపాడులో జెడ్పీ పాఠశాలల్లో జరుగుతున్న ‘నాడు–నేడు’ పనులను మంత్రి సురేశ్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 4.50 లక్షల మంది ప్రభుత్వ విద్యార్థుల్లో ప్రతి ఒక్కరికీ రూ.1,600 విలువ చేసే 'జగనన్న విద్యా కానుక' కిట్‌ను అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, విద్యా శాఖ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment