తాడేపల్లి: కాంట్రాక్ట్ ఉద్యోగులందరి రెగ్యులర్‌కు ఒకే జీవో ఇస్తామని సీఎస్ తెలిపినట్లు ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈరోజు(గురువారం) జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ముగిసిన తర్వాత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ..
‘ఇప్పటివరకూ 460 డిమాండ్ లలో 332 డిమాండ్ లు పరిష్కారం అయ్యాయి. కాంట్రాక్ట్ ఉద్యోగులందరి రెగ్యులర్ కు ఒకే జీవో ఇస్తామన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేసే చోట రెగ్యులర్ చేసేంత వరకు నోటిఫికేషన్ లు ఇవ్వొద్దని కోరాం.
ఓపీఎస్ టు జిపిఎస్ గతంలో కంటే బాగుందని సమర్థించాం. జిపిఎస్ ఉత్తర్వులు ఇచ్చే ముందు ఉద్యోగ సంఘాలతో చర్చించాలని కోరాం.. అందుకు సీఎస్ అంగీకరించారు. జగన్న లే అవుట్ లలో ఇచ్చిన స్థలం కాకుండా జిల్లా హెడ్ క్వాటర్స్ లో ఉద్యోగులకు వంద ఎకరాలు ఇళ్ల స్థలాలకు కేటాయించాలని కోరాం. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్‌కు ప్రభుత్వ స్కీంలు ఇవ్వాలని, జీతాలు పెంచాలని కోరాం... అందుకు సైతం సీఎస్ అంగీకరించారు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment