సాక్షి, కృష్ణా: వారి పేర్లు వాడకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు వెళ్తే గుండు సున్నాతో సమానమని ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. కనీస పరపక్వతలేని, రాజకీయ అజ్ఞాని పవన్ కల్యాణ్ అని నాని విమర్శించారు.
అయితే, గుడివాడ 10వ వార్డులో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్, చిరంజీవిల పేర్లు వాడకుండా ఎన్నికలకు వెళితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు గుండు సున్నాతో సమానం. వ్యక్తిగతంగా ఒక్క శాతం కూడా ఓటు లేనీ పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ కలిసి పోటీ చేసి.. 60 శాతం ఓటింగ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఏం చేయగలరు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పీడ విరగడవుతుంది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు కూడా ఎమ్మెల్యేగా గెలవరు అని కామెంట్స్ చేశారు.
మరోవైపు.. కరణం ధర్మశ్రీ కూడా జనసేన అధినేత పవన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ది జనసేన కాదు.. ధనసేన. పేమెంట్ రాగానే పవన్ మూమెంట్ మారింది. పవన్ కల్యాణ్ టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: మరి చంద్రబాబు మంత్రి పదవి ఎందుకు ఇవ్వనట్టు?: లక్ష్మీపార్వతి
Comments
Please login to add a commentAdd a comment