సాక్షి, కృష్ణా: టడీపీ అధినేత చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా గుంటూరు సభలో దారుణం జరిగింది. కానుకలిస్తామని చెప్పి ముగ్గురు మహిళల ప్రాణాలను బలితీసుకున్నారు. ఇక, ఈ దారుణ ఘటనపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు.
ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ.. సభల కోసం చంద్రబాబు జనాన్ని తీసుకువచ్చి పిచ్చి పబ్లిసిటీ చేస్తున్నారు. ఇరుకు సందులు చూసుకుని డ్రోన్ కెమెరాలతో షూటింగ్ చేసుకుంటున్నారు. మొన్న కందుకూరులో ఎనిమిది మంది ప్రాణాలను బలిగొన్నారు. కందుకూరు ఘటనకు చంద్రబాబు, లోకేష్, రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, బీఆర్ నాయుడిలను బాధ్యులను చేయాలి. ఇప్పుడు కానుకలిస్తామని పదిరోజుల నుంచి ప్రచారంతో ఊదరగొట్టారు. ఒక్కో మహిళకు మూడు చీరలిస్తామని చెప్పారు. 30 వేల మంది టోకెన్లు పంచారు.
కానుకలు, చీరలను ఇస్తామని దొంగమాటలు చెప్పారు. చంద్రబాబు తన స్పీచ్ కోసం 2:30 గంటల నుంచి జనాన్ని నిలబెట్టారు. నలుగురికి చీరలు పంచి హడావుడి చేశారు. తొక్కిసలాట కారణంగా ముగ్గురు చనిపోయారు. ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు. వీళ్ల ఉసురు చంద్రబాబుకి కచ్చితంగా తగులుతుంది. ముఖ్యమంత్రి అయ్యాక శాసనసభకు వస్తానన్న 420 చంద్రబాబు చనిపోయిన మహిళలకు ఏం సమాధానం చెబుతాడు. చంద్రబాబుకి సిగ్గు, శరం లేదు. అధికారంలోకి రావడానికి ఎవరెలా చచ్చినా చంద్రబాబుకి అవసరం లేదు. శనికి మరో రూపమే చంద్రబాబు. చంద్రబాబు ఎక్కడ కాలు పెడితే అక్కడ నాశనమే. ఈ ఘటనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గుంటూరు ఘటనపై న్యాయ విచారణ చేపట్టాలి అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment