సాక్షి, కర్నూలు: జిల్లా పోలీసు శాఖలోని స్పెషల్ బ్రాంచ్ విభాగం నంద్యాల డివిజన్ ఎస్‌ఐగా పనిచేస్తున్న ఎల్.రఘురామయ్య తన 30 ఏళ్ల సర్వీసు పూర్తి చేసి పదవీ విరమణ పొందాల్సి ఉంది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు(క్రమబద్ధీకరణ చట్టం) 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ రాజపత్రం సోమవారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయానికి చేరడంతో రఘురామయ్య పదవీ విరమణ ఆగిపోయింది.
చదవండి: జీతం పడకుండా తగ్గినట్లు మీకు ఎలా తెలుసు?: ఏపీ హైకోర్టు
జిల్లా పోలీసు శాఖలో ఈయన ఒక్కరే పదవీ విరమణ పొందాల్సి ఉండటంతో అరుదైన ఈ అవకాశం ఆయనకు లభించిందని సహోద్యోగులు చర్చించుకోవడం కనిపించింది. ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామానికి చెందిన ఈయన 1987లో కానిస్టేబుల్ హోదాలో పోలీసుశాఖలో చేరి 2020 అక్టోబర్‌లో ఎస్‌ఐగా పదోన్నతి పొందారు. మరో రెండు సంవత్సరాలు సర్వీసు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి: ఎవ్వరికీ జీతాలు తగ్గలేదు.. ఆ ఆలోచనను విరమించుకోండి: సీఎస్ సమీర్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment