
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కనకదుర్గ అమ్మవారిని శనివారం దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. కరోన నిబంధనలు పాటిస్తూ 10 వేల మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారని తెలిపారు. ఆన్‌లైన్‌లో ముందుగా టికెట్ బుక్ చేసుకున్న వారు మాత్రమే అమ్మవారి దర్శనానికి రావాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment