
సాక్షి, అమరావతి: చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. ప్రభుత్వం పిలిచినా ఉద్యోగులు చర్చలకు రాకపోవడం కరెక్ట్ కాదని అన్నారు. ఈ రోజు కూడా పీఆర్‌సీ సాధన కమిటీ వాళ్ళు చర్చలకు రాలేదని తెలిపారు. తమ పిలుపు మేరకు కొన్ని సంఘాల నాయకులు వచ్చారని, సమస్యలు ప్రస్తావించారని పేర్కొన్నారు. చర్చలకు ఎవరు వచ్చినా మాట్లాడుతామన్నారు. ఉద్యోగులు ప్రభుత్వంలో అంతర్భాగమేనని, ఉద్యోగులు, ప్రభుత్వం వేరు కాదని వ్యాఖ్యానించారు.