సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆళ్లనాని తెలిపారు. కోవిడ్ బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. కరోనా బాధితుల కోసం 37 వేల వరకు బెడ్స్ పెంచామని చెప్పారు. అవసరానికి తగ్గట్టు ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచినట్లు.. ఎవరూ ఆందోళన చెందొద్దని భరోసా ఇచ్చారు.
అమరావతిలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత లేకుండా చూస్తామని చెప్పారు. ఇప్పటివరకు 62 లక్షల మందికిపైగా వ్యాక్సినేషన్ ఇచ్చామని వెల్లడించారు. చంద్రబాబు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు. సంక్షోభ సమయంలోనూ చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: నాలుగంటే నాలుగే రోజుల లాక్‌డౌన్: ఎక్కడంటే..
Comments
Please login to add a commentAdd a comment