
సాక్షి, విజయవాడ: కరోనా వైరస్ కట్టడిలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. విజయవాడలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే కరోనా పరీక్షలు అత్యధికంగా చేసిన రాష్ట్రం ఏపీ అని పేర్కొన్నారు.. 14 ల్యాబ్‌లు ఏర్పాటు చేసి రోజుకు సుమారు 70వేల పరీక్షలు చేస్తున్నారన్నారు. కోవిడ్-19పై ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. (చదవండి: కొత్తగా 16 వైద్య కళాశాలలు)
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కనీస బాధ్యత లేకుండా ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని, ప్రభుత్వ కార్యక్రమాలను భగ్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రతిపక్షనేతకు వంతపాడుతూ కొన్ని పత్రికలు అసత్య వార్తలు రాస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. (చదవండి: కరోనా మృతదేహాలపై ఆభరణాలు మాయం; ఆళ్లనాని సీరియస్)
Comments
Please login to add a commentAdd a comment