సాక్షి, అమరావతి: విపత్కర పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మంత్రి ఆళ్ల నాని మండిపడ్డారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్‌లో కూర్చుని ఆయన ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కరోనా నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోందన్నారు. దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ కిట్లు తీసుకొచ్చామని.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పనితీరును ఉప రాష్ట్రపతి కూడా ప్రశంసించారని పేర్కొన్నారు. (వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఉప రాష్ట్రపతి ప్రశంసలు)
కరోనా నివారణపై సమాచారం ఇచ్చేందుకు సిద్ధం..
కరోనా నివారణపై సమాచారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి స్పష్టం చేశారు. అత్యాధునిక సదుపాయాలతో కొవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో 12 కొత్త ల్యాబ్‌లు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల కోసం ఐసీఎంఆర్ నుంచి అనుమతులు తెచ్చుకున్నామని వివరించారు. కరోనా పరీక్షల సామర్థ్యం 6 వేలకు పెంచామని చెప్పారు. కరోనా పరీక్షల సామర్థ్యం త్వరలో 12,500కు పెంచుతామని మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment