
సాక్షి, విజయవాడ: వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జులై 22 వరకు 200.3 మి.మీ. వర్షపాతం ఉండాల్సి ఉంటే 256 మి..మీ వర్షపాతం నమోదైందని వివరించారు. అత్యధికంగా అనంతపురం, చిత్తూరు, కడపలో వర్షాలు పడ్డాయని.. 55 మండలాల్లో కొన్ని ప్రాంతాల్లో పొలాలు ముంపునకు గురయ్యాయని తెలిపారు. వర్షాలు తగ్గగానే నష్టాన్ని అంచనా వేస్తామని పేర్కొన్నారు. రైతులకు నష్టం జరిగితే తక్షణమే స్పందిస్తామని మంత్రి కన్నబాబు తెలిపారు.