
సాక్షి, అమరావతి: నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం కలిశారు. నాయీ బ్రాహ్మణులను, వారి సామాజికవర్గాన్ని కించపరిచే పదాలపై ప్రభుత్వం నిషేదం విధిస్తూ జీవో జారీ చేయడంపై కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: (నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలపై నిషేధం)
తమ ఆత్మగౌరవాన్ని కాపాడారని సీఎంకు వివరిస్తూ సంతోషాన్ని వ్యక‍్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన వారిలో నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్దవటం యానాదయ్య, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి కోటేశ్వరరావు, నాయీ బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జి. రామదాసు, కే. శ్రీదేవి, నందిని ఉన్నారు.
చదవండి: (ఆ ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవు: సీఐడీ చీఫ్ సునీల్ కుమార్)
Comments
Please login to add a commentAdd a comment