Nayee Brahmins
-
నాయీ బ్రాహ్మణులకు ఏపీ సర్కార్ గూడ్ న్యూస్..
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలోని వివిధ ఆలయాల కేశ ఖండనశాలల్లో విధులు నిర్వహించే నాయీ బ్రాహ్మణులకు నెలకు కనీసం రూ.20 వేల ఆదాయాన్ని వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేశ ఖండనశాలల్లో తలనీలాల కార్యక్రమం కనీసం వంద రోజులు కొనసాగే ఆలయాలలో ఇది వర్తిస్తుందని దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి (ఎఫ్ఏసీ) హరిజవహర్‌లాల్ ఆదేశాలు జారీ చేశారు. భక్తులు తలనీలాలు సమర్పించే టిక్కెట్ ధరను రూ.40కి పెంచి ఆ మొత్తాన్ని సంబంధిత నాయీ బ్రాహ్మణులకే అందజేస్తారు. రద్దీ సమయాల్లో టికెట్ల విక్రయాల ద్వారా లభించే ఆదాయం రూ.20 వేల కంటే ఎక్కువగా ఉంటే అది కూడా మొత్తం సంబంధిత నాయీ బ్రాహ్మణులకే చెల్లిస్తారు. ఒకవేళ తగినంత డిమాండ్ లేక టికెట్ల అమ్మకం ద్వారా రూ. 20 వేల కంటే తక్కువ ఆదాయం లభిస్తే తలనీలాలు విక్రయాల ద్వారా సమకూరే మొత్తం నుంచి ఆమేరకు చెల్లించాలని నిర్ణయించారు. టికెట్టు ధర రూ.40కి పెంచడం ద్వారా కేశఖండన శాలలు వంద రోజుల లోపు పనిచేసే ఆలయాలలో సైతం నాయీ బ్రాహ్మణులు అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని దేవదాయ శాఖ వర్గాలు తెలిపాయి. నాడు చంద్రబాబు చిందులు.. టీడీపీ అధికారంలో ఉండగా తమకు కనీస ఆదాయం వర్తింపజేయాలని కోరుతూ సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు బెదిరించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం తాజాగా జీవో విడుదలైంది. సముచిత స్థానం.. నాయీ బ్రాహ్మణులకు సీఎం జగన్ ప్రభుత్వం దేశ చరిత్రలోనే అరుదైన గౌరవాన్ని కల్పించిందని ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల ట్రస్టు బోర్డులో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ఒకరికి తప్పనిసరిగా స్థానం కల్పించాలని ఆర్డినెన్స్ జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చదవండి: స్పీచ్ అదిరింది.. వాస్తవాలు కళ్లకు కట్టారు.. టీడీపీ హయాంలో అవమానాలు ఎదుర్కొన్న తమకు సీఎం జగన్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పించిందని నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య, నాయీ బ్రాహ్మణ సంఘాల రాష్ట్ర నేతలు గుంటుపల్లి రామదాసు, ఇతర నాయకులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేశారు. -
కార్పొరేట్ కత్తిరింపు మొదలైతే... వారి అస్తిత్వానికి ముప్పు!
పారిశ్రామికీకరణ కర్కశ పాదాల కింద ఎన్నో చేతివృత్తులు నలిగి పోయాయి. ఇంతకాలం మైల పనిగా భావించిన వృత్తుల్లో సైతం ఎన్నో మార్పులు వచ్చాయి. దాంతో సాంప్రదాయిక మంగలి (నాయీ బ్రాహ్మణ) వృత్తిపై కార్పొరేట్ కన్ను పడింది. కేశాలంకరణకు, రూప సౌందర్యానికి ఎంతైనా ఖర్చుపెట్టేవాళ్లు పెరుగుతున్న క్రమంలో వారి అవసరాలు తీర్చే రీతిలో కులవృత్తి మంగళ్ళు ఎదిగివచ్చే పరిస్థితులు లేవు. దీన్ని కార్పొరేట్లు చేజిక్కించుకొని, క్షుర కర్మ ఒక కుల వృత్తి అనే ముద్రని తుడిచేసే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం 45 శాతం కస్టమర్లు మాములు కటింగ్ చేయించుకోగా మిగతావారు చూడచక్కగా కనబడేందుకు సెలూన్లకు వస్తున్నారు. ఐదేళ్లలో ఈ ఫ్యాషన్ కస్టమర్ల సంఖ్య 60 శాతం పెరిగిందట. 2014లో రిలయన్స్ రిటైల్ తరపున హెయిర్ కటింగ్ షాపులు ఆరంభిస్తామన్న ప్రకటన రాగానే క్షురకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దాంతో ఆ ప్రతిపాదన వెనక్కి పోయింది. ఈ నవంబర్ మొదటివారంలో మరో వార్త వచ్చింది. నేచురల్స్ స్పా సంస్థలో 49 శాతం భాగస్వామ్యాన్ని కొనుగోలుకు ముకేశ్ అంబానీ సిద్ధపడినట్లు తెలుస్తోంది. చెన్నైకి చెందిన నేచురల్స్‌కి దేశంలోని ప్రముఖ నగరాల్లో 700 పైగా సెలూన్లు ఉన్నాయి. 2025 నాటికి ఆ సంఖ్యను 3,000కి పెంచాలనే ఆలోచనతో ముకేశ్ పావులు కదుపుతున్నారని వార్త. ఆయన సొంత సొమ్ముతో కొన్ని దుకాణాలు తెరిచినా కొంత కాలం తర్వాత ఫ్రాంచైజీ విధానాన్ని మొదలు పెడతారు. బ్రాండ్ పేరు కస్టమర్లలో చొచ్చుకు పోయాక ఆ పేరుతో షాపు తెరిచేందుకు వచ్చినవారి నుండి డిపాజిట్లు వసూలు చేసి రోజువారీ వ్యాపారంలో కమిషన్ తీసుకుంటారు. సొంత షాపుల బేరాలు దెబ్బ తింటే మంగలి కులంవారు ఈ సెలూన్లలో పనికి కుదరక తప్పదు. వారు తమ అస్తిత్వాన్ని కోల్పోవడంతో పాటు తమ వృత్తిలోనే కూలీలుగా మారే దుఃస్థితి వస్తుంది. అందుకే కార్పొరేట్లు ఈ వ్యాపారంలోకి రాకుండా ప్రభుత్వాలు అడ్డుకోవాలని నాయీబ్రాహ్మణ సంఘాలు కోరుతున్నాయి. (క్లిక్ చేయండి: ఆ వృత్తిని మాకు మాత్రమే పరిమితం చేయాలి) – బి. నర్సన్, రచయిత 94401 28169 -
ఆ వృత్తిని మాకు మాత్రమే పరిమితం చేయాలి
సాక్షి, హైదరాబాద్: క్షౌరవృత్తిని నాయీబ్రాహ్మణులకే పరిమితం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక విజ్ఞప్తి చేసింది. బడా పారిశ్రామిక వేత్తలు, ఇతర కులాలు తమ వృత్తిలోకి ప్రవేశించి నాయీబ్రాహ్మణుల జీవనోపాధికి గండికొడుతున్నాయని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు యం. లింగం నాయీ ఆవేదన వ్యక్తం చేశారు. రిలయన్స్ సహా పలు బడా సంస్థలు మోడ్రన్ సెలూన్స్ పేరుతో తమ పొట్ట కొడుతున్నాయని.. ఇలాంటి వాటికి అనుమతులు ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మోడ్రన్ సెలూన్స్‌కు వ్యతిరేకంగా తాము చేపట్టిన ఆందోళనకు కేసీఆర్ అండగా నిలబడ్డారని.. ప్రత్యేక రాష్ట్రం రాగానే క్షౌరవృత్తిని నాయీబ్రాహ్మణులకే పరిమితం చేస్తూ జీవో ఇస్తానని మాటిచ్చినట్టు గుర్తు చేశారు. ఇతర కులవృత్తులను కాపాడటానికి జీవోలు ఇచ్చినట్టుగానే తమకు కూడా ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అభ్యర్థించారు. నాయీ బ్రాహ్మణ సహకార సంఘాల సమాఖ్య ద్వారా క్షౌరవృత్తిదారులకు ఆర్థిక సహాయం అందించాలని పత్రికా ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కాగా, రిలయన్స్ సెలూన్స్ వ్యాపారంలోకి రావడాన్ని వ్యతిరేకిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో నాయీబ్రాహ్మణులు ఆందోళనలకు దిగుతున్నారు. -
సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన నాయీ బ్రాహ్మణ నాయకులు
-
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు
సాక్షి, అమరావతి: నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం కలిశారు. నాయీ బ్రాహ్మణులను, వారి సామాజికవర్గాన్ని కించపరిచే పదాలపై ప్రభుత్వం నిషేదం విధిస్తూ జీవో జారీ చేయడంపై కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: (నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలపై నిషేధం) తమ ఆత్మగౌరవాన్ని కాపాడారని సీఎంకు వివరిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన వారిలో నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సిద్దవటం యానాదయ్య, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి కోటేశ్వరరావు, నాయీ బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జి. రామదాసు, కే. శ్రీదేవి, నందిని ఉన్నారు. చదవండి: (ఆ ఫోరెన్సిక్ రిపోర్టులో వాస్తవాలు లేవు: సీఐడీ చీఫ్ సునీల్ కుమార్) -
సీఎం జగన్‌కు కృతజ్ఞతలు: బాబ్జినంద
సాక్షి, అమరావతి: నాయీ బ్రాహ్మణులను కులం పేరుతో అవమానించే వారిపై చర్యలు తీసుకునేలా జీవో నంబరు 50ని ప్రభుత్వం విడుదల చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తమ ఆత్మగౌరవం కాపాడేలా జీవో విడుదల చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాయీ బ్రాహ్మణులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. ‘థ్యాంక్యూ సీఎం’ అంటూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ నాయిబ్రాహ్మణ నందయువసేన వ్యవస్థాపక అధ్యక్షులు ఇంటూరి బాబ్జినంద బుధవారం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను కలిసి స్వయంగా కృతజ్ఞతలు తెలిపారు. పాదయాత్రలో తమకు ఇచ్చిన మిగిలిన హామీలు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని విన్నవించారు. తమ అభ్యర్థనకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని బాబ్జి వెల్లడించారు. సీఎంను కలిసే అవకాశం కల్పించిన నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలుకు ధన్యవాదాలు తెలిపారు. (క్లిక్: నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలపై నిషేధం) -
నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలపై నిషేధం
సాక్షి, అమరావతి: నాయీ బ్రాహ్మణులను, వారి సామాజికవర్గాన్ని కించపరిచే పదాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధం విధించింది. మంగలి, మంగలోడా, బొచ్చుగొరిగేవాడా, మంగలిది, కొండ మంగలి తదితరాలను నాయీబ్రాహ్మణులను ఉద్దేశించి ఉపయోగిస్తే.. వారి మనోభావాలను గాయపరిచినట్టుగా పరిగణిస్తారు. అందుకు బాధ్యులైన వారిపై భారత శిక్షాస్పృతి 1860 కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జీవో ఎంఎస్ 50 జారీ చేశారు. ఆగస్టు 7న జారీ చేసిన ఈ జీవో బుధవారం వెలుగులోకి వచ్చింది. సర్వత్రా హర్షం కులదూషణను నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై నాయీ బ్రాహ్మణులు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెల్పుతున్నారు. సీఎం చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జీవో ఎంఎస్ 50ను విస్తృతంగా ప్రచారం చేసి ఆత్మగౌరవాన్ని కాపాడుకుందామని నాయీ బ్రాహ్మణ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. (క్లిక్: ఏదినిజం.. గోబెల్స్‌ను మించిన రామోజీ!) తెలంగాణలోనూ అమలు చేయండి నాయీ బ్రాహ్మణులను కించపరిచే పదాలను ఏపీ ప్రభుత్వం నిషేధించడం పట్ల తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయి హర్షం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాయీ బ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని కాపాడటానికి తెలంగాణలోనూ ఇటువంటి జీవో తేవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. (క్లిక్: గోరంట్ల మాధవ్ పేరిట వైరల్ అవుతున్న వీడియో ఒరిజినల్ కాదు)