సాక్షి, అమరావతి: జాతీయ ఎనర్జీ ఎక్స్చేంజీల్లో విద్యుత్ ధరలను ఎవరూ నియంత్రించలేరు. కేవలం గరిష్ట సీలింగ్ ధరను మాత్రమే నిర్ణయించగలరు. ఆ అధికారం కూడా కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్‌సీ)కే ఉంది. ఇంత చిన్న విషయంపైన కూడా అవగాహన లేకనో లేదా ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వంపైన, సీఎం వైఎస్ జగన్ పైనా బురద జల్లాలనే అత్యుత్సాహమో ఈనాడు బుధవారం ఓ తప్పుడు కథనాన్ని అచ్చేసింది. ‘మనం చేస్తే ఖర్చు.. మరొకరైతే దోపిడీ’ అంటూ అవాస్తవాలను అల్లింది.
ప్రజల అవసరాలకు రాష్ట్రంలో ఉన్న విద్యుత్ సరిపోనప్పుడు బహిరంగ మార్కెట్‌లో కొనైనా ఇబ్బంది లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడమే తప్పన్నట్టుగా ఆ కథనంలో అక్కసు వెళ్లగక్కింది. విద్యుత్‌ను బయట నుంచి మూడు రెట్లు అధిక ధరకు కొంటున్నారని, ఆ భారం ప్రజలపైనే వేస్తారని లేనిపోని అపోహలు సృష్టించేందుకు ప్రయత్నించింది. దీనిపై ఇంధన శాఖ వెల్లడించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి.
► దేశంలో విద్యుత్ ఎక్స్చేంజిలు కొత్తగా ఏమీ రాలేదు. 2008–09 ఆర్థిక సంవత్సరం నుంచి ఉన్నాయి. అప్పటి నుంచి వివిధ రకాల మార్కెట్ సెగ్మెంట్ల ద్వారా స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లు జరుగుతున్నాయి. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు స్వల్పకాలిక విద్యుత్ అవసరాల కోసం ఎప్పటి నుండో ఈ ఎక్స్చేంజిలపై ఆధారపడ్డాయి.
► మార్కెట్ ధరలు ఆ రోజుకి, ఆ టైం బ్లాక్ (ఒక రోజులో 96 టైం బ్లాక్ లు ఉంటాయి. ఒక్కోటీ 15 నిమిషాల సమయం)లో మార్కెట్‌లో అందుబాటులో ఉన్న విద్యుత్, డిమాండ్ బిడ్లు ఆధారంగా ఉంటాయి.
► ఇందులో బయటి నుంచి ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉండదు. ఈ ఎక్స్చేంజిలు కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాల ప్రకారం, మండలి నిబంధనలు, నియమావళికి లోబడి పనిచేస్తాయి.
► నెల వారీగా కొనే ద్వైపాక్షిక విద్యుత్ ఒప్పందాలైతే డీఈఈపీ, ఈ–బిడ్డింగ్ పోర్టల్ ద్వారా నిర్దేశిస్తారు. ఈ పోర్టల్ కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేస్తుంది. కేంద్ర విద్యుత్ శాఖ ఎక్స్చేంజిల్లో కొనే విద్యుత్‌కు గరిష్ట ధర (సీలింగ్ ప్రైస్) యూనిట్ రూ.10గా కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి నిర్ధారించింది.
► పీక్ లోడ్ సమయం ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వివిధ కేటగిరీల లోడ్‌ను బట్టి, అందుబాటులో ఉండే ఉత్పత్తి వనరులపై ఆధారపడి ఉంటుంది. అంతే కానీ ఈ ధరలను ఎవరూ నియంత్రించలేరు.
► పీక్ అవర్స్‌లో విద్యుత్ కొనుగోలు కూడా ఇంధన, విద్యుత్ కొనుగోలు వ్యయ సర్దుబాటు చార్జీల రూపంలో వసూలు చేసుకోవడానికి డిస్కంలకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) అనుమతి ఇచ్చింది. దాని ప్రకారమే చార్జీలు వసూలు చేస్తున్నారు.
► మార్కెట్ ధరలు మూడు రెట్లు పెరగలేదు. గతంలో సీలింగ్ ధర యూనిట్‌కు రూ. 20 ఉండేది. అప్పుడు కూడా అత్యవసరాన్ని బట్టి డిస్కంలు యూనిట్‌కు రూ. 17 వరకు వెచ్చించి కొన్నాయి. ఈ ఏడాది అనూహ్యంగా పెరిగిన డిమాండ్ వల్ల, జల విద్యుత్ లేకపోవడం వల్ల మార్కెట్‌లో ధరలు పీక్ సమయంలో దాదాపు సీలింగ్ ప్రైస్ యూనిట్ రూ .10, రోజువారీ ధర రూ.6 నుంచి రూ.9 వరకు సీఈఆర్‌సీ నిర్ణయించింది. అంతేగానీ ధరలు మూడు రెట్లు పెరగలేదు.
► మార్కెట్ కొనుగోళ్లలో ఏ విధమైన ప్రమేయాలూ ఉండవు. ధరలు మార్కెట్ అంశాల ఆధారంగానే నిర్ధారణ చేస్తారు.
► దేశంలోనే అతి పెద్ద విద్యుత్ ఎక్స్చేంజి ఐఈఎక్స్ గణాంకాల ప్రకారం.. సంవత్సరం అంతా సాయంత్రం పీక్ లోడ్ సరాసరి ధరలు (అన్ని నెలలు, సీజన్లు కలుపుకుని) గత 8 సంవత్సరాలుగా ఈ విధంగా ఉన్నాయి.
Fact Check: ఎక్స్చేంజీల్లో చెప్పిన ధరకే విద్యుత్ కొనుగోలు
Published Thu, Sep 7 2023 5:23 AM | Last Updated on Thu, Sep 7 2023 5:24 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment