సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక సదుపాయాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు. కేటీఆర్ అయినా మరెవరైనా మాట్లాడే ముందు వాళ్ల రాష్ట్రం గురించి మాట్లాడాలన్నారు. ఆ తర్వాతే ఇతరుల గురించి మాట్లాడాలని సూచించారు. ఈ మేరకు సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. 'రాష్ట్ర విభజన తర్వాత ఆస్తుల పంపకాలు ఇంకా పూర్తిగా జరగలేదు. సుమారు రూ.50-60 వేల కోట్ల ఆస్తులు విభజన జరగాల్సి ఉంది. ఏపీకి కేపిటల్ లేకుండానే విభజన చేశారు. విభజన తర్వాత 5 ఏళ్లపాటు అభివృద్ది జరగలేదు.
చదవండి: (కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి పెద్దిరెడ్డి)
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ది చెందింది. హైదరాబాద్‌లో పీవీ ఎక్స్‌ప్రెస్ వే వైఎస్ హయాంలో చేపట్టారు. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో వాళ్లకూ, మనకూ అందరికీ తెలుసు. అధిక వర్షాల వల్లే రాష్ట్రంలో రోడ్లు దెబ్బతిన్నాయి. కేటీఆర్ వ్యాఖ్యలను రాజకీయం చేయదలచుకోలేదు. తెలంగాణలోనూ రోడ్లు బాగాలేవు. మొన్నటి వరకు తెలంగాణలోనూ విద్యుత్ కోతలున్నాయి. రాష్ట్ర ప్రజలకు అన్ని విషయాలు తెలుసు. సీఎం జగన్ పాలనలో తన మార్కును చూపిస్తున్నారు' అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
చదవండి: (Ramya Murder Case: ఉరిశిక్షపై శశికృష్ణ తల్లి స్పందన ఇదే..)
ఈ తీర్పు చెంపపెట్టు లాంటిది
గుంటూరులో గత ఏడాది ఆగస్టు 15న జరిగిన బీటెక్ విద్యార్థిని నల్లపు రమ్య (20) హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితుడు శశికృష్ణకు ఉరిశిక్ష విధించింది. దిశ చట్టం తెచ్చిన స్ఫూర్తితోనే యువతిని చంపిన నిందితుడికి ఉరిశిక్ష పడిందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. దిశ చట్టంపై ప్రతిపక్షాలు చేస్తున్నవన్నీ కూడా రాజకీయ విమర్శలేనన్నారు. దిశ చట్టంపై విమర్శలు చేస్తోన్న వారికి ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
చదవండి: (హైదరాబాద్‌లోనే కరెంట్ లేదు: కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్)
Comments
Please login to add a commentAdd a comment