సాక్షి, తాడేపల్లి: ఉమ్మడి రాష్ట్ర విభజన అంశంపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, సజ్జల గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ‘విభజన చట్టం అసంబద్ధమని ఇప్పటికే సుప్రీంకోర్టులో కేసు ఉంది. మళ్లీ ఉమ్మడి రాష్ట్రం కాగలిగితే తొలుత స్వాగతించేది వైఎస్సార్‌సీపీనే అని స్పష్టం చేశారు.
ఉండవల్లి వ్యాఖ్యలు అసంబద్ధమైనవని పేర్కొన్న సజ్జల.. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచి వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తున్నదని గుర్తు చేశారు. ‘‘అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాయి. విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో మా వాదనలు బలంగా వినిపిస్తాము. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలి.. లేదంటే సరిదిద్దాలని గట్టిగా కోరుతాము. ఇప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలిసి ఉండాలన్నదే మా విధానం. విభజన చట్టంలో హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉంది. రెండు రాష్ట్రాలు కలిసి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే ఏం కావాలి అని సజ్జల పేర్కొన్నారు.
అలాగే, బీసీలను అన్ని రంగాల్లో ప్రోత్సహించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది. బీసీ డిక్లరేషన్ అమలుతో సీఎం వైఎస్ జగన్‌పై విశ్వాసం పెరిగింది. రాష్ట్రానికి ప్రథమ శత్రువు చంద్రబాబు, టీడీపీనే. బీసీ సభ సక్సెస్‌ను జీర్ణించుకోలేక విషం కక్కుతున్నారు’ అని కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment