సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో గత నెలరోజులుగా ఏం జరుగుతుందో మనం చూస్తున్నాము. ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కాగా, క్యాంపు కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘విశాఖ గర్జణ రోజునే పవన్ అక్కడికి వచ్చారు. కావాలనే గందరగోళం సృష్టించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు కుట్రలు చేస్తున్నారు. గత నెలరోజులుగా రాష్ట్రంలో ఏం జరుగుతుందో మనం చూస్తున్నాము. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు తాపత్రయపడుతున్నారు.
ఇప్పటంపై టీడీపీ, జనసేన అనవసర రాద్దాంతం చేస్తున్నాయి. ప్రభుత్వం ఆక్రమణలను కూల్చాలా..? వద్దా..?. ఏమీలేని దాని గురించి సినిమా స్క్రిప్ట్ రాస్తున్నారు. ఇప్పటంలో పవన్ అంత ఆవేశం ఎందుకు ప్రదర్శించారో అర్థం కావడంలేదు. రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందన్నట్టు క్రియేట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు హయంలో మాయాబజార్ చూపించారు. ఇప్పటంలో గోడ కూడా కూల్చలేదు. చంద్రబాబు పాలనంతా కరువే. చంద్రబాబు హయంలో ఎప్పుడూ ధర్నాలే జరిగేవి. రాయితో దాడిచేశారని చంద్రబాబు డ్రామా చేశారు’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment