సాక్షి, తాడేపల్లి: కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై టీడీపీ రాజకీయ ఆరోపణలు చేస్తోందని, దానిపై చర్చిస్తున్నామని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, టీడీపీ బలహీనపడిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. దాన్ని ఎల్లో మీడియా ఎందుకు ప్రసారం చేయలేదని సజ్జల ప్రశ్నించారు.
‘‘టీడీపీ జవసత్వాలు ఉడికిన పార్టీ అని, ఎన్టీయే నుండి బయటకు వచ్చానన్నారు. ఎన్టీయే నుండి బయటకు వచ్చారనేదానిపై బీజేపీ స్పందించాలి. టీడీపీ బలహీన పడిందనే విషయం కూడా ఆ పార్టీ నేతలు ఒప్పుకోవాలి. పవన్ ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నారో చెప్పాలి. టీడీపీని జనసేన టేకోవర్ చేసినట్టయితే ఆ విషయం కూడా చెప్పాలని సజ్జల అన్నారు.
‘‘చంద్రబాబు కేసు కోర్టులో ఉంది. దాని గురించి జగన్ ఢిల్లీ వెళ్లడం ఏంటి?. స్కాంలో దొరికినందునే చంద్రబాబు జైలుకు వెళ్లారు. కేంద్రం, రాష్ట్రాల మధ్య ఉండాల్సిన సంబంధాలనే జగన్ కొనసాగిస్తున్నారు. దానివలన కలిగే ప్రయోజనాలు కనిపిస్తూనే ఉన్నాయి. ముందస్తు ఎన్నికలకు పోవాల్సిన పని జగన్‌కు లేదు. పొద్దుపోని ఆరోపణలు చేస్తూ టీడీపీ నేతలు కాలం గడుపుతున్నారు. చివరికి పిల్లలను కూడా రాజకీయ ఆరోపణలకు వాడుకుంటున్నారు. రెండు రోజులు పళ్లాలు కొట్టే పనులేవో చేశారు. స్కిల్ స్కాంలో నిధులన్నీ చంద్రబాబు మనుషులకే అందించామని పారిపోయిన ఇద్దరు వ్యక్తులు చెప్పారు. పారిపోయిన వ్యక్తులను చంద్రబాబు త్వరగా పిలిపించి సీఐడీకి అప్పగిస్తే మంచిది’’ అని సజ్జల హితవు పలికారు.
‘‘జగన్ గురించి లోకేష్ పనీపాట లేని ఆరోపణలు చేస్తున్నారు. 17ఏ అనే ఒక్కదాని గురించే చంద్రబాబు, ఆయన లాయర్లు మాట్లాడుతున్నారు. స్కాం జరిగిందని గుర్తించారు కాబట్టే చంద్రబాబు, లాయర్లు మాట్లాడలేకపోతున్నారు. ఎల్లోమీడియా పిచ్చి పిక్ లెవల్‌కి పోయింది. చిన్న పిల్లలతో కారుకూతలు మాట్లాడిస్తున్నవారు ఇక జడ్జీలు, ప్రభుత్వ లాయర్లను వదులుతారా?. వారి మానసిక స్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని సజ్జల పేర్కొన్నారు.
చదవండి: స్కిల్ స్కాం కేసులో కీలక డాక్యుమెంట్ల సమర్పణ
Comments
Please login to add a commentAdd a comment