విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏది చేసినా చిత్రంగానే ఉంటుంది. ఆయన మాటల దగ్గర్నుంచీ చేతల వరకూ అన్నీ వింతగానే ఉంటాయి. తాజాగా ఏపీ మంత్రులకు చంద్రబాబు ప్రకటించిన ర్యాంకులు కూడా అదే చందంగా ఉన్నాయి. మంత్రులకు ఇచ్చిన ర్యాంకుల్లొ తన తనయుడు లోకేష్‌కు 8 వర్యాంకు కట్టబెట్టిన చంద్రబాబు.. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కల్యాణ్‌కు మాత్రం 10వ ర్యాంకు ఇవ్వడం హాట్ పిక్ అయ్యింది. మంత్రుల ర్యాంకుల్లో పవన్‌ను లోకేష్‌కంటే వెనక్కి నెట్టేశారు చంద్రబాబు. అయితే ఇక్కడ పవన్ కంటే లోకేష్ బెటర్ అన్న సందేశం పంపారు చంద్రబాబు.
ప్రస్తుతం లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేసే పనిలో ఉన్న చంద్రబాబు.. ఆ క్రమంలోనే తనకుమారుడి ఒక మంచి ర్యాంకు కట్టబెట్టారని, అది కూడా పవన్ కంటే మంచి ర్యాంకు ఇచ్చారనే వాదన తెరపైకి వచ్చింది. అసలు పవన్ కల్యాణ్ హాజరు కానీ క్యాబినెట్‌ర్యాంకులు ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక పవన్ ను లోకేష్ కంటే తక్కువ చేసి చూపడంపై జనసేన కార్యకర్తలు, నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫైళ్ల క్లియరెన్స్ ఆధారంగా ర్యాంకులు ప్రకటించినా, ఫైళ్లు తక్కువగా ఉన్న మంత్రులకు మంచిర్యాంకులు ఇవ్వడం ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. చంద్రబాబు మాత్రం తన ర్యాంకును 6గా ప్రకటించుకున్నారు. తొలి స్థానంలో మంత్రి ఫరూక్ ఉండగా, ఆఖరి స్థానంలో వాసంశెట్టి సుభాష్ ఉన్నారు.
మంత్రులకు చంద్రబాబు ఇచ్చిన ర్యాంకులు కింది ివిధంగా ఉన్నాయి..
1.ఫరూఖ్
2. కందుల దుర్గేష్
3.కొండపల్లి శ్రీనివాస్
4. నాదెండ్ల మనోహర్
5. డోలా బాలవీరాంజనేయ స్వామి
6. చంద్రబాబు
7. సత్యకుమార్ యాదవ్
8. నారా లోకేష్
9. బీసీ జనార్థన్ రెడ్డి
10. పవన్ కళ్యాణ్
11. సవిత
12. కొల్లు రవీంద్ర
13. గొట్టిపాటి రవికుమార్
14. నారాయణ
15. టీజీ భరత్
16. ఆనం రాం నారాయణరెడ్డి
17. అచ్చెన్నాయుడు
18. రాంప్రసాద్ రెడ్డి
19. గుమ్మడి సంధ్యారాణి
20. వంగలపూడి అనిత
21. అనగాని సత్యప్రసాద్
22. నిమ్మల రామానాయుడు
23. కొలుసు పార్థసారధి
24. పయ్యావుల కేశవ్
25. వాసంశెట్టి సుభాష్
Comments
Please login to add a commentAdd a comment