సాక్షి, తిరుమల: తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ కొంతమేరకు తగ్గింది. కొందరు భక్తులు తిరుమల ప్రయాణం వాయిదా వేసుకుంటుండగా, మరికొందరు వేర్వేరు కారణాలతో కొండపైకి రాలేకపోతున్నారు. దీంతో భక్తుల రద్దీ తగ్గింది. ముఖ్యంగా సర్వదర్శనం నిన్న కేవలం ఆరు గంటల్లోనే జరిగింది
ఉదయం తిరుమలో ఆరు కంపార్ట్‌మెంట్లలో భక్తులు ఉన్నారు. సర్వదర్శానానికి కేవలం ఆరు గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం తర్వాత రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఇక, నిన్న(మంగళవారం) తిరుమల శ్రీవారిని 73,137 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే, శ్రీవారికి 27,490 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.06 కోట్లుగా ఉంది. ఎలాంటి టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులు త్వరగా వేంకటేశ్వరుడి దర్శనం పూర్తి కావడంతో సంతోషం వ్యక్తం చేశారు. అయితే, భక్తులు ముందస్తుగా దర్శన టికెట్లు ఆన్ లైన్ లో చేసుకుని ఆ తర్వాతే కొండపైకి రావాలని, దళారులను నమ్మి మోసపోవద్దని టిటిడి అధికారులు సూచించారు. ముందస్తుగా బుక్ చేసుకోకపోతే.. కొండపై కష్టమవుతుందని, సర్వదర్శనం మినహా ఏ విధంగా దర్శించుకోలేరని స్పష్టం చేశారు.
Tirumala Lucky Dip Sevas, Step by step booking process
— Tirupati Tirumala Info (@tirupati_info) July 18, 2023
1. Thomala Seva - https://t.co/CHlu8eXQv7
2. Suprabatham Seva - https://t.co/O9mRdclgYf
3. Archana Seva - https://t.co/h1bytNW6gz#tirupati #tirumala #thomala #archana #suprabatham #ttd #bangalore #chennai #pune pic.twitter.com/6WnmkBvIn8
ఇక సెప్టెంబర్ లో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలో మరమ్మతులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ఆగస్టు నెల మొత్తం శ్రీవారి పుష్కరిణిని మూసివేయనున్నారు. శ్రీవారి పుష్కరిణికి మరమ్మతులు చేసి బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేస్తారు.
మరోవైపు తిరుపతి, తిరుమలలో వర్షం ఎడతెరిపి లేకుండా పడుతోంది. మధ్యమధ్యలో కొంత తెరిపినిచ్చినా.. వర్షం పూర్తిగా తగ్గడం లేదు. కొండ మీద ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి. చలి పెరిగింది. సాధారణంగానే శ్రీ వేంకటేశ్వరుడి నివాసమైన తిరుమల గిరులపై చల్లగా ఉంటుంది. మారిన వాతావరణంతో మరింత చల్లగా మారింది.
Today at Tirumala Temple in the early hours pic.twitter.com/T2FLwYdTTw
— GoTirupati (@GoTirupati) July 26, 2023
ఇది కూడా చదవండి: ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Comments
Please login to add a commentAdd a comment