దక్షిణాది రాష్ట్రాల సమావేశం వాయిదా | Southern states meeting postponed | Sakshi
Sakshi News home page

దక్షిణాది రాష్ట్రాల సమావేశం వాయిదా

Published Tue, Mar 2 2021 4:43 AM | Last Updated on Tue, Mar 2 2021 4:43 AM

Southern states meeting postponed - Sakshi

సాక్షి, అమరావతి/చిత్తూరు కలెక్టరేట్‌: తిరుపతిలో ఈ నెల 4న జరగాల్సిన దక్షిణాది రాష్ట్రాల సమావేశం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 4, 5 తేదీల్లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పర్యటన సైతం రద్దయినట్టు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. 29వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశానికి ఆంధ్రప్రదేశ్‌ ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. అవసరమైన చర్యలు తీసుకునేలా కొద్ది రోజులు కిందట ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, బందోబస్తుకు సంబంధించి డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌లు ప్రత్యేక చర్యలు చేపట్టారు. కాగా, పరిపాలన పరమైన అంశాల నేపథ్యంలో ఈ సమావేశాన్ని వాయిదా వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోప్రకటిస్తారని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ మురుగన్‌ హరినారాయణన్‌ చెప్పారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement