
సాక్షి, అమరావతి: తండ్రి మరణానంతరం బిడ్డ సహజ సంరక్షకురాలు తల్లే కాబట్టి ఆ బిడ్డ ఇంటి పేరు నిర్ణయించే విషయంలో ఆమెకు సంపూర్ణ హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. రికార్డుల్లో ఆమె రెండో భర్త పేరును ‘సవతి తండ్రి’గా పేర్కొనాలంటూ ఏపీ హైకోర్టు ఓ మహిళ విషయంలో ఇచ్చిన ఉత్తర్వులను జస్టిస్ దినేశ్ మహేశ్వరి, కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం కొట్టేవేసింది.
ఆమె రెండో భర్తను సవతి తండ్రిగా చేర్చాలని హైకోర్టు ఆదేశించడం క్రూరమైనది, అనాలోచితమైనదని వ్యాఖ్యానించింది. ఇది మానసికంగా ఆ బిడ్డపై ఎంతో ప్రభావం చూపుతుందని, అలాగే ఆత్మగౌరవానికి కూడా ఇబ్బంది కలిగిస్తుందని చెప్పింది. దత్తత ఇచ్చే విషయంలో కూడా తల్లికే పూర్తి హక్కు ఉందని తేల్చిచెప్పింది. ఇలాంటి కేసుల్లో ముందుగా పిల్లల ప్రయోజనాలనే పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment