సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. తిరుమల లడ్డూపై టీటీడీ ఈవో శ్యామలరావు కీలక ప్రకటన చేశారు. ఒక కంపెనీ నెయ్యిలో వెజిటబుల్ కొవ్వు కలిసిందని ఈవో చెప్పుకొచ్చారు. దీంతో, అసలు వాస్తవం బయటకు వచ్చింది.
టీటీడీ ఈవో శ్యామలరావు.. తిరుమల లడ్డూ కోసం ఉపయోగిస్తున్న వాటిలో ఒక కంపెనీ నెయ్యిలో వెజిటబుల్ కొవ్వు కలిసిందని చెప్పుకొచ్చారు. అయితే, వెజిటబుల్ ఫ్యాట్‌ను జంతువుల ఫ్యాట్ అంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశారు. ఈ క్రమంలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. తిరుమల లడ్డు విశిష్టతను దెబ్బతీసేలా బాబు తప్పుడు ప్రచారానికి తెర లేపారు. తాజాగా ఈవో ప్రకటనతో సీఎం చంద్రబాబు విష ప్రచారం బట్టబయలైంది.
ఇక, తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు తప్పుడు ప్రచారంపై వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో చంద్రబాబుకు సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. ఈ విషయంలో స్వామి దగ్గర తాను తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమన్నారు. అలాగే, చంద్రబాబు కుటుంబంతో సహా వచ్చి ప్రమాణం చేయాలని చాలెంజ్ చేశారు. ఇక, సుబ్బారెడ్డి సవాల్‌పై చంద్రబాబు ఇప్పటి వరకు స్పందించలేదు.
ఇది కూడా చదవండి: బాబు నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట: భూమన కరుణాకరరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment