తిరుమలలో భక్తుల రద్దీ
తిరుమల: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ క్రమంగా పెరుగుతోంది. శ్రీవారిని ఆదివారం అర్ధరాత్రి వరకు 61,052 మంది దర్శించుకున్నారు. అదేవిధంగా స్వామి వారికి 27,500 మంది తలనీలాలు సమర్పిం చారు. శ్రీవారి హుండీలో భక్తులు రూ.4.57 కోట్లు వేశారు.
సర్వ దర్శనం టోకెన్లు ఇస్తున్న తేదీలకు అనుగుణంగా భక్తులు ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని ఇప్పటికే పలుమార్లు టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుపతిలోని భూదేవి, శ్రీనివాసం, గోవిందరాజు సత్రం సముదా యాల్లో ఉచిత సర్వదర్శనం టోకెన్లను టీటీడీ కేటాయిస్తోంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు దర్శనానికి వచ్చే 48 గంటల ముందు చేయించుకున్న కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తీసుకురావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment