గుర్తింపు లేని డిగ్రీ కాలేజీల అడ్మిషన్ల నిలిపివేత | Unrecognized Degree colleges Admissions stopped Andhra Pradesh | Sakshi
Sakshi News home page

గుర్తింపు లేని డిగ్రీ కాలేజీల అడ్మిషన్ల నిలిపివేత

Published Fri, Aug 27 2021 2:59 AM | Last Updated on Fri, Aug 27 2021 2:59 AM

Unrecognized Degree colleges Admissions stopped Andhra Pradesh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని యూనివర్సిటీల గుర్తింపు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న 40 ప్రైవేట్, అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల అడ్మిషన్లను 2021–22 విద్యాసంవత్సరానికి నిలిపివేస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి కార్యదర్శి ప్రొఫెసర్‌ బి.సుధీర్‌ప్రేమ్‌కుమార్‌ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

యూనివర్సిటీల గుర్తింపు లేకపోవడం, మూడేళ్లుగా ఎలాంటి అడ్మిషన్లు కూడా చేయకపోవడంతో ఈ  నిర్ణయం తీసుకున్నారు. అలాగే 257 కాలేజీల్లో విద్యార్థుల చేరికలు లేని 454 ప్రోగ్రాముల్లో కూడా ఈ ఏడాది అడ్మిషన్లు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కాలేజీలకు నోటీసులు జారీచేశామని, నెలరోజుల్లో ఆయా యాజమాన్యాలు తమ వివరణలను ఉన్నత విద్యామండలికి సమర్పించాలని పేర్కొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement