సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రతిపక్ష టీడీపీ వ్యవహరాన్ని తప్పుబడుతూ వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుపై ఓ ట్వీట్ చేశారు. ‘ఎట్టెట్ట అచ్చెన్నా.. పంచాయితీ ఎన్నికలు వాయిదా వేసినప్పుడు (మార్చిలో) కరోనా కేసులు ఎక్కువ ఉన్నాయా? ఇప్పుడు తగ్గిపోయాయా? అడ్డెడ్డె ఏం అవగాహన? ఏం నాలెడ్జ్ ? చిట్టిబాబు లోకేశంని మించి పోతున్నావ్‌గా. అందుకే చాలాకాలం క్రితం జగన్ గారు తమరికి సలహానిచ్చింది బుర్ర పెంచుకోమని. చెప్తే వినవూ?’ అంటూ ట్వీట్ చేశారు. (ఇప్పట్లో ఎన్నికలు కష్టం)
కాగా కరోనా నియంత్రణకు దేశంలోనే అత్యుత్తమ స్థాయిలో అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ పరిస్థితి ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని, ఈ సమయంలో ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణం లేదని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికల నిర్వహణకు అనువైన వాతావరణం లేదని పేర్కొంటూ సీఎస్ నీలం సాహ్ని బుధవారం సాయంత్రం ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను కలిసి నివేదిక ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment