
విజయవాడ: నగరంలోని పాత ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి మంకీపాక్ప్ నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. చిన్నారి నమూనాలను విమానంలో పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించామని అందులో నెగిటివ్‌గా వచ్చినట్లు ఏపీ ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ జె. నివాస్ వెల్లడించారు. చిన్నారికి వచ్చిన దద్దుర్లు మంకీపాక్స్ కాదని నిర్ధారణ అయినట్లు పేర్కొన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని, ఏపీలో మంకీపాక్ప్ పాజిటివ్ కేసులేవీ లేవని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment