
సాక్షి, విజయవాడ: విద్యుత్ కోతలు ఉండకూదనే తరచు సీఎం జగన్ సమీక్షలు నిర్వహిస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఇంతవరకూ విద్యుత్ కోతలు అనే సమస్యే రాలేదన్నారు. ఈరోజు(గురువారం) విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రూ. 15 కోట్లతో నిర్మించిన మూడు విద్యుత్ సబ్ స్టేషన్లను మంత్రి పెద్దిరెడ్డి ప్రారంభించారు.
దీనిలో భాగంగా మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి.. ‘ 2016లో శంకుస్థాపనలు చేసి వదిలేసిన సబ్‌స్టేషన్లను మేం పూర్తి చేశాం. విద్యుత్ కోతలు ఉండకూడదనే తరచూ సీఎం జగన్ సమీక్షలు. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఇంతవరకూ విద్యుత్ కోతల్లేవు. 24 గంటలపాటు ఎలాంటి కోతల్లేకుండా విద్యుత్ ఇస్తున్నాం. రైతులు, పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.
ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన వాగ్ధానాన్ని సీఎం నెరవేర్చారు. రైతులకు పగటిపూటే విద్యుత్ ఇస్తున్నాం. ఒక విద్యుత్ కనెక్షన్ కూడా పెండింగ్‌లో లేదు. మేం వచ్చాక లక్షా 25వేల పెండింగ్ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశాం. రైతులు దరఖాస్తు చేసిన వెంటనే విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేశాం. చంద్రబాబు ఏం మాట్లాడతాడో అతనికే అర్థం కాదు’ అని పేర్కొన్నారు.
ఎన్జీటీ మార్గదర్శకాలకు అనుగుణంగా చర్యలు