ముస్లింలకు వైఎస్‌ జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు | YS Jagan Bakrid Wishes To Muslims: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ముస్లింలకు వైఎస్‌ జగన్‌ బక్రీద్‌ శుభాకాంక్షలు

Published Mon, Jun 17 2024 4:17 AM | Last Updated on Mon, Jun 17 2024 9:05 AM

YS Jagan Bakrid Wishes To Muslims: Andhra Pradesh

గుంటూరు, సాక్షి: ముస్లిం సోదర, సోద­రీ­­మ­ణు­లకు వైఎస్సా­ర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ బక్రీద్‌ శుభా­కాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉదయం తన ఎక్స్‌ ఖాతాలో ఆయన సందేశం ఉంచారు. 

అంతకు ముందు.. ఓ ప్రకటనలోనూ ఆయన బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. త్యాగ­నిరతికి, ధర్మ­బద్ధ­తకు, దాతృత్వానికి బక్రీద్‌ ప్రతీకగా నిలుస్తుంద­న్నారు. దైవ ప్రవక్త ఇబ్ర­హీం త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నా­రు. పేద, ధనిక తారత­మ్యాలు లేకుండా, రాగద్వేషా­లకు అతీతంగా ముస్లింలందరూ ఈ పండు­గను భక్తిశ్రద్ధలతో నిర్వ­హించుకుంటారని చెప్పారు. అల్లాహ్‌ ఆశీ­స్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని అభిలషించారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement